Breaking News

23/01/2020

వికాస తరంగిణి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి జనవరి 23 (way2newstv.in)
 మహిళల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా వికాస తరంగిణి అనే సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన  తెలిపారు. శ్రీ రాంపూర్ మండలం మల్యాల గ్రామంలో గురువారం కీ.శే  ఎర్రవెల్లి శ్రీనివాస్ రావు   స్మారకార్థం  నిర్వహిస్తున్న  మహిళా ప్రత్యేక వైద్య శిభిరాన్ని   జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన   రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్  రావు  సతీమణి  ఎర్రవల్లి ఉష తో కలిసి ప్రారంభించారు.   మల్యాల గ్రామంలో వికాస తరంగిణీ వారు ఏర్పాటు చేసిన  మహిళల ప్రత్యేక వైద్య శిభిరాన్ని  కలెక్టర్ పరిశీలించారు.  
వికాస తరంగిణి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ 2010వ సంవత్సరంలో మహిళల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా వికాస తరంగిణి అనే సంస్థ ఏర్పాటు చేయబడిందని,  ఈ  సంస్థ ద్వారా ఇప్పటి వరకు 10 లక్షల 40 వేల మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి , 3 లక్షలకు పైగా మహిళలకు అవసరమైన చికిత్సలు అందజేయడం  జరిగిందని అన్నారు.   మహిళలకు నిర్వహించే వైద్య పరీక్షలు   ఉచితంగా వికాస తరంగిణీ అనే సంస్థ  నిర్వపిస్తుందని,   తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జగదీష్ గారు అంగన్వాడి కార్యకర్తలకు వికాస తరంగిణి అనే సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నారని అన్నారు.  మల్యాల గ్రామంలో  మహిళలు మరియు చుట్టు పక్కల గ్రామాల వారు  సైతం   ప్రత్యేగ వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. గ్రామ సర్పంచ్ లంకె రాజేశ్వరి, సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

No comments:

Post a Comment