Breaking News

07/09/2019

అన్యమత ప్రచారం... ముగ్గురు అరెస్ట్

తిరుమల, సెప్టెంబర్ 7, (way2newstv.in)
తిరుమల కొండపై అన్యమత మందిరం  నిర్మించారంటూ  సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ముగ్గురు యువకులను తిరుపతి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోషల్ మీడియాలో అసత్యాలను పోస్ట్ చేస్తూ..వాటిపై కామెంట్ చేసేవారిని, వాటిని షేర్ చేసేవారిపైనా టీటీడీ కొరడా ఝులిపిస్తోంది. సోషల్ మీడియాలో టీటీడీపై ఏది పోస్టుచేసినా విపరీతమైన కామెంట్స్ ఉంటాయి. అంతేకాదు అదినిజమా అబద్దమా అని కూడా నిర్ధారించుకోకుండా షేర్ చేసేస్తారు నెటిజన్లు. ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని టీటీడీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. 
అన్యమత ప్రచారం... ముగ్గురు అరెస్ట్

ఏడుకొండలపై ఏసు మందిరాలు అంటూ దుష్ప్రచారానికి తెరలేపారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసి, షేర్  చేసినందుకు  అణువణువునా హిందుత్వం.. అనే వాట్సప్ గ్రూప్ సభ్యుడిగా ఉన్న హైదరాబాద్ కు చెందిన అరుణ్ కాటేపల్లితో పాటు కార్తిక్ గరికపాటి, గుంటూరు కి చెందిన మిక్కిలినేని సాయి అజిత్ చక్రవర్తిలను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ పోలీస్ సూపరింటెండెంట్ అన్బురాజన్ తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులు ముగ్గురినీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. టీటీడీ విజిలెన్స్ విభాగం  అధికారులు ఇచ్చిన  ఫిర్యాదు  మేరకు వారిపై కేసు నమోదుచేసినట్లు చెప్పారు. తిరుమల కొండల్లో చర్చి ఉందని  చూపుతూ..... ఫారెస్టు  సెల్ టవర్ బిల్డింగును, దానిపై కెమెరా అమర్చే ఇనుప కమ్మీని శిలువగా చిత్రికరిస్తూ ఫొటోలు పోస్ట్ చేసి, షేర్ చేసారని తెలిపారు.

No comments:

Post a Comment