Breaking News

24/01/2020

బాబుకు అమరావతి గండం...

విశాఖపట్టణం, జనవరి 24, (way2newstv.in)
ల్లారిలేస్తే అమరావతి రాజధాని, దాని పరిరక్షణ అంటూ గత నెల రోజులుగా జోలె పట్టి తిరిగిన చంద్రబాబు మరో మూడు నెలలు ఇదే డ్రామాను కొనసాగించేందుకు పెద్ద అవకాశం సాధించారు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లుకి బ్రేక్ వేసి చంద్రబాబు సాధించింది టెంపరరీ విక్టరీ మాత్రమేనని అంటున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో వైసీపీకే రాజకీయంగా లాభమని కూడా అంటున్నారు. చంద్రబాబు ఈ కంపుని మరింతగా పెంచుకుని చివరికి అమరావతికే పరిమితమైపోతారన్న టాక్ నడుస్తోంది.అమరావతే రాజధానిగా ఉండాలి. ఇదీ టీడీపీ విధానం. ఇది 2019 ఎన్నికల వరకూ ఉంది. అందుకే రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాల్లో గట్టి దెబ్బ పడిపోయింది. 
బాబుకు అమరావతి గండం...

52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమ నాలుగు జిల్లాల్లో టీడీపీకి దక్కినవి ముచ్చటగా మూడు అంటేనే ఆ పార్టీకి అమరావతి దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో అర్ధమవుతుంది. మరో వైపు ఉత్తరాంధ్రా జిల్లాల్లో కూడా మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గాను ఆరు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఇదంతా రాజధాని మహిమే మరి. అయినా ఇపుడు టీడీపీ మారలేదు, చంద్రబాబు కూడా మారలేదు. ఇక ఇపుడు కూడా పెద్దేమనిషి తరహాలో మార్పు కోరుకోకుండా ఇంకా అమరావతి అంటూ ప్రచారం చేసుకోవడం వల్ల చంద్రబాబు పార్టీకే పెను భారమవుతుందని అంటున్నారు.ఇక జగన్ విషయానికి వస్తే ఆయనకు కొత్తగా పోయేదేమీలేదు. వెనకబడిన ప్రాంతాలకు రాజధానులు ఇచ్చి అభివృధ్ధి చేద్దామనుకుంటే టీడీపీ విష రాజకీయం చేసి ఏమీ కాకుండా చేసిందని ధైర్యంగా చెప్పుకోవచ్చు. జనం కూడా ఇపుడు చంద్రబాబునే విలన్ గా చూస్తారు. దాంతో మరింతగా ఆ పార్టీ మీద నెగిటివ్ ప్రచారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. పంతానికి పోయి టీడీపీ చేసిన దానికి ఈ రకమైన ఫలితాలే వస్తాయని కూడా అంటున్నారు.నిజానికి ఏ రాజకీయ పార్టీ అయినా తన స్టాండ్ చెప్పుకోవచ్చు. టీడీపీకి అమరావతి కావాలి. అందులో తప్పులేదు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన అత్యున్నత సభ అసెంబ్లీ ఒక తీర్మానం ఆమోదించిన తరువాత మండలిలో చర్చకు పెట్టి గెలిపించినా ఓడించినా సబబుగా ఉంటుంది. అది కాదని సెలెక్ట్ కమిటీ పేరిట మూడు నెలల పాటు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం అంటే ఇది టీడీపీకి పెద్ద బ్యాడ్ గానే తీసుకోవాలని అంటున్నారు. ఈ బిల్లు ఎప్పటికైనా చట్టం అవుతుంది. కాకపోతే ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్యానికి కారణంగా చంద్రబాబు చరిత్రలో రెండు వెనకబడిన ప్రాంతాలలో నిలిచిపోతారు. మొత్తానికి తన పార్టీ రాజకీయ భవిష్యత్తులు కూడా ఫణంగా పెట్టి చంద్రబాబు ఆడిన ఈ పులి జూదం చివరికి ఎటువటి చేదుని తినిపిస్తుందోనని పెద్ద చర్చ సాగుతోంది.

No comments:

Post a Comment