అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్
వనపర్తి నవంబర్ 21 (way2newstv.in)
ప్రజలకు సత్వర సేవలందించడంలో బ్లూ కోట్స్, పెట్రో కార్స్ వీధులే కీలకమని, విధినిర్వహణలో మానవతా దృక్పథం జోడించి విధులు నిర్వహించి ప్రజల మనసులను దోచుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ అన్నారు. గురువారం రోజు వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల బ్లూకోర్టు,పెట్రోకార్, సిబ్బందికి బ్లూ కోర్టు,పెట్రోకార్ వర్టీ కల్ అంశం మీద వర్టీకల్ ఇంచార్జి ఆత్మకూరు సీఐ, సీతయ్యతో ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
రాజనగర్ క్యాంపు లో కార్తీక వన భోజనాలు
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మాట్లాడుతూ... అత్యవసర సమయంలో ప్రజలు వినియోగించే డయల్ 100 కాల్స్ పట్ల వేగవంతం అయిన స్పందన తప్పక ఇవ్వాలని, తక్కువ సమయంలో సంఘటన స్థలానికి చేరి సేవలు అందించాలని, డయల్ 100 ఫిర్యాదుల పట్ల రెస్పాన్స్ సమయం, క్లోజింగ్ సమయం ఎప్పటికపుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని తెలిపారు. డయల్ 100 కాల్స్ నకు సత్వరమే స్పందించి అక్కడ ఏర్పడిన సమస్య గురించి తెలుసుకుని వెంటనే పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను "ఫింగర్ ప్రింట్ స్కాన్" మరియు మొబైల్ సెక్యూరిటి చెక్ డివైస్, మరియు "ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం"ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా అక్కడ సమస్యను పరిష్కరించే విధంగా వెంటనే చేరుకోవడంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ విధులు నిర్వర్తించడంలో బ్లూకోల్ట్స్ పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు.
No comments:
Post a Comment