Breaking News

31/01/2020

రెండో రోజూ నష్టాల్లో మార్కెట్లు

ముంబై, జనవరి 31  (way2newstv.in)
దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా పడిపోయింది. పార్లమెంట్‌లో శుక్రవారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2020 ఇన్వెస్టర్లకు రుచించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ 6-6.5 శాతం మధ్యలో ఉండొచ్చని పేర్కొంది. దీంతో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది.
సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 40,723 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 11,962 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. మెటల్, ఐటీ, ఫార్మా, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బ్యాంక్ షేర్లు మాత్రం లాభపడ్డాయి.
రెండో రోజూ నష్టాల్లో మార్కెట్లు

✺ నిఫ్టీ 50లో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో షేర్లు లాభపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ దాదాపు 4 శాతం పెరిగింది.
✺ అదేసమయంలో టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, యూపీఎల్, ఐఓసీ షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్ ఏకంగా 5 శాతం పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు లాభపడ్డాయి.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 12 పైసలు లాభంతో 71.37 వద్ద కదలాడుతోంది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.22 శాతం పెరుగుదలతో 58.42 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.33 శాతం పెరుగుదలతో 52.31 డాలర్లకు ఎగసింది.

No comments:

Post a Comment