Breaking News

04/09/2018

ఛత్రపతిగా అభిషేక్ బచ్చన్

హైద్రాబాద్, సెప్టెంబర్ 4 (way2newstv.in) 
ఏమాటకామాటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే కొందరికి కాస్త చిన్నచూపు ఉండేది. మనోళ్లు రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు తీస్తారన్న ఒక ఓపినీయన్‌ ఉండేది. కానీ టాలీవుడ్‌ ట్రెండ్ ఇప్పడు పూర్తిగా మారిపోయింది. మన సినిమాల రీమేక్‌ రైట్స్ కోసం ఇతర ఇండష్ట్రీ వాళ్లు అర్రులు చాస్తున్నారు. మన బాహుబలి నటించిన ఓ బ్లాక్ బాస్టర్ మూవీని బాలీవుడ్ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చెయ్యాలనుకుంటున్నాడట అభిషేక్‌ బచ్చన్. ఇప్పడు ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్‌లో ట్రెండింగ్‌గా మారింది.మన తెలుగు ఫిలిం మేకర్స్ కి పేరు ఇప్పడు నేషనల్ లెవల్‌లో గట్టిగా వినిపిస్తుంది.  కొన్నేళ్ళ క్రితం తెలుగు సినిమాలను మన ప్రేక్షకులే చులకన చేసేవాళ్ళు. ఇక కొంతమంది తెలుగు వీరాభిమానులు కేవీరెడ్డి  తరం నుండి  విశ్వనాథ్.. బాపు వరకూ ఇప్పటి క్రిష్, చంద్రశేఖర్‌ ఏలేటి జనరేషన్ వరకూ కొంతమంది మంచి అభిరుచి కలిగిన డైరెక్టర్ల సినిమాల పేర్లు చెప్పి తెలుగు సినిమా గొప్పే అని వాదించాల్సి వచ్చేది.  ఇప్పుడు ఆ అవసరం దాదాపుగా లేదు. 



ఛత్రపతిగా  అభిషేక్ బచ్చన్

బాహుబలి దెబ్బకు టాలీవుడ్ పేరు అంతటా మార్మోగిపోయింది. ఇక ఘాజీ ..అర్జున్ రెడ్డి.. గూఢచారి, త్వరలో రాబోతున్న కంచరపాలెం లాంటి  చాలా సినిమాల దెబ్బకు అందరూ ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు..  ఇదిలా ఉంటే ఎప్పటినుండో మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లోకి  రీమేక్ అవుతూ ఉన్నాయి..  ఇప్పుడు కూడా సెట్స్ పై పలు రీమేక్ సినిమాలున్నాయి. కాకపోతే ఇప్పుడు ఆ రీమేక్స్ సంఖ్య బాగా రెట్టిపయ్యింది. ఆ కోవలోనే ఒక బాలీవుడ్ హీరోకు ఒక తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా పై కన్నుపడింది.  తనకు గనక అవకాశం వస్తే ప్రభాస్ - రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 'ఛత్రపతి' రీమేక్ లో లో నటించాలని ఉందని మనసులో మాటను బయట పెట్టాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడు స్మాల్ బీ అభిషేక్ బచ్చన్.  ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్‌లో చర్చకు దారితీసింది. రాజమౌళి ఛత్రపతిని ఓవర్‌ లోడెడ్‌ ఎమోషన్స్‌తో తెరకెక్కించాడు. ఇది అప్పట్లో సెన్సేషనల్‌ విజయం సాధించింది. ప్రభాస్ నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అన్ని రకాల ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీపై ఇప్పుడు అభిషేక్‌ మనసు పడ్డాడు. దీన్ని బట్టి చూస్తే బాహుబలి దెబ్బకు ప్రభాస్ ఓల్డ్ మూవీస్‌పై చాలా మంది ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టే అర్థమవుతుంది.అభిషేక్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అవకాశం వస్తే 'ఛత్రపతి' హిందీ రీమేక్లో నటించాలని ఉంది అని చెప్పాడు. అతని సన్నిహితులు దగ్గర కూడా ఇదే విషయంపై అభిషేక్ ఇదే విషయాన్ని చెప్పాడంట.

No comments:

Post a Comment