న్యూ ఢిల్లీ జనవరి 31 (way2newstv.in)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు విపక్షాలు ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నాఆర్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం ముందు విపక్షాలు ధర్నా
కాగా అంతకుముందు పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన తీరుపై విపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జామీయానగర్ కాల్పుల ఘటన, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నాఆర్సీ, ఎన్పీఆర్‌లపై అనుసరించాల్సిన వైఖరిపై చర్చించినట్లు సమాచారం. కాగా ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. కాగా మొదటి దఫా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి.
No comments:
Post a Comment