Breaking News

04/09/2018

మోడీ చంద్రబాబు, కేసీఆర్ అందరూ ఒక్కటే

హైద్రాబాద్, సెప్టెంబర్ 4 (way2newstv.in) 
ముంద‌స్తు వ్యూహం ఒక‌రిది.. ఇన్నాళ్లూ దూరంగా ఉంచిన కుటుంబాన్ని అక్కున చేర్చుకుని ఆద‌రించాన‌నే సింప‌థీ ప్రజ‌ల్లో తెచ్చుకోవాల‌నే ప్రణాళిక మ‌రొక‌రిది. ఒక కుటుంబంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకింత ప్రేమ చూపుతున్నారు. ఆ కుటుంబంలోని వ్యక్తి మ‌ర‌ణిస్తే.. ఒక‌రు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు నిర్వహించారు. మ‌రొక‌రు.. చివ‌రి కార్యక్రమాలు ముగిసే వ‌ర‌కూ అన్నీ ముందుండి న‌డిపించారు. ప్రేమ‌, అభిమానం, ఆప్యాయ‌త‌, బంధు ప్రీతి.. వంటివ‌న్నీ ఆ కుటుంబంపై ఇద్దరు చంద్రుల‌కు లేవ‌ని చెప్పలేం. కానీ ఒక్కసారిగా ఎనలేని ప్రేమ కురిపిస్తుంటడ‌మే అంద‌రినీ విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే కాదు.. అటు దేశంలోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. కురువృద్ధుడు, మాజీ ప్రధాని వాజ్‌పేయ్ మ‌ర‌ణం, ఇటు సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌యుడు హ‌రికృష్ణ మృతి త‌ర్వాత.. జ‌రిగిన ప‌రిమాణాలు కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌ను ప్రజ‌ల‌కు ప‌రిచయం చేస్తున్నాయి.అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌రిగ్గా స‌ద్వినియోగం చేసుకుంటేనే స‌త్ఫలితాలు అందుకుంటారు. 



మోడీ చంద్రబాబు, కేసీఆర్
అందరూ ఒక్కటే

ఏ రంగంలోనైనా ఇదే ప్రాథ‌మిక సూత్రం. రాజ‌కీయాల్లో నేత‌లు దీనిని మ‌రింత‌గా గుర్తుంచుకోవాలి. మ‌రి రాజ‌కీయ వ్యూహాల్లో కాక‌లు తీరిన యోధుల్లాంటి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రధాని మోడీ.. ఈ సూత్రాన్ని అమ‌లు ప‌రిచే సమ‌యం కోసం వేచిచూస్తూ ఉంటారు. నంద‌మూరి హ‌రికృష్ణ హ‌ఠాన్మర‌ణంతో.. ఆయ‌న అంత్యక్రియ‌ల‌ను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో హ‌రికృష్ణ కుటుంబ స‌భ్యుల‌కు ఏపీ సీఎం చంద్రబాబు బాస‌ట‌గా నిల‌వ‌డంపై హ‌ర్షాతిరేకాలు వ్యక్తమ‌వుతున్నాయి. బావ‌మ‌రిదిపై ప్రేమ చంద్రబాబుకు లేద‌ని అన‌లేకున్నా.. ఇప్పుడే గుర్తుకువ‌చ్చారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే క‌నిపిస్తున్నారు. అసెంబ్లీని ర‌ద్దు చేసి డిసెంబ‌రులోనే ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌నే చ‌ర్చ మ‌రింత అధిక‌మవుతోంది. ఇప్పటికే అన్ని వ‌ర్గాల ఓట‌ర్లపై ఎన్నోవ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్న కేసీఆర్‌.. దృష్టి క‌మ్మ సామాజిక వ‌ర్గం, సెటిల‌ర్లపై ప‌డింది. వీరి మ‌ద్దతు పొందేందుకు వ్యూహాలు ర‌చించారు కేసీఆర్‌. ఈ నేపథ్యంలోనే అధికారిక లాంఛ‌నాల‌తో నంద‌మూరి హ‌రికృష్ణ అంత్యక్రియ‌లు అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వహించేలా ప్లాన్ చేశారనే విశ్లేష‌ణ‌లు జోరందుకున్నాయి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా ద‌గ్గరుండి మ‌రీ ఏర్పాట్లు చూసుకున్నారు. అంతేగాక ఎన్నడూ లేని విధంగా హ‌రికృష్ణ పాడె కూడా మోశారు. ఇన్నాళ్లూ హ‌రికృష్ణ కుటుంబాన్ని దూరంగా ఉంచి విమ‌ర్శలు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే! దీంతో ఎంతైనా సింప‌తీ వ‌ర్కవుట్ చేసుకోవ‌చ్చనేది వీరి వ్యూహమ‌నే వ్యాఖ్యలు ఉన్నాయి.ఇక దేశ రాజ‌కీయాల్లోనూ ఇలాంటి ప‌రిస్థితే. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ మృతి.. ఆ త‌ర్వాత జ‌రిగిన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ కూడా కొంత ఉత్సుక‌త చూపారు. ఒక‌ప‌క్క మ‌రో కురు వృద్ధుడు ఎల్‌కే అద్వానీని పక్కన పెట్టి.. స‌ముచిత గౌర‌వం ఇవ్వడం లేద‌నే విమ‌ర్శలను ఎదుర్కొంటున్నారు మోడీ. ఈ స‌మ‌యంలో వాజ్‌పేయ్ చ‌నిపోతే.. ఆయ‌న అభిమానుల సింప‌థీ కోసం హ‌డావుడి చేశారు. కిలోమీటర్లు వాజ్ పేయి పార్థీవ దేహం వెంట నడిచారు. దేశంలో మోడీ వ్యతిరేక ప‌వ‌నాలు తీవ్రంగా వీస్తున్నాయి. ఈ త‌రుణంలో వాజ్‌పేయ్ అంతిమ యాత్రలో దాదాపు ఏడు కిలోమీట‌ర్లు న‌డ‌వ‌డం కొంత ఆశ్చర్యం క‌లిగించ‌క మాన‌దు.

No comments:

Post a Comment