కేంద్ర ఎన్నికల సంఘం బెస్ట్ ఎలక్ర్టోరల్ ప్రాక్టీస్ అవార్డు ఎంపికైన కలెక్టర్
శనివారం డిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా అందజేత
జగిత్యాల జనవరి 23(way2newstv.in)
ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసిన అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి గౌరవించే అవార్డుకు తెలంగాణ రాష్ట్రం నుండి జగిత్యాల కలెక్టర్ డా. ఎ. శరత్ ఎంపికయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం బెస్ట్ ఎలక్టరోల్ ప్రాక్టిస్ అవార్డుకు శరత్ ను ఎంపిక చేసింది. జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారిగా 2019 లోక్ సభ ఎన్నికల్లో విశేషమైన కృషి చేసినందుకు ఆయన ను ఈ అవార్డును వరించింది.
జగిత్యాల జిల్లా కలెక్టర్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు
కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డు ఇదే కావడం గమనార్హం. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ పడినా.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లతో రిపోలింగ్ కు ఏ మాత్రం అవకాశం లేకుండా ఓటర్లకు అవగాహణ కల్పిస్తూ.. ఎన్నికను సమర్ధవతంగా నిర్వహించినందుకు ఆయనను కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల ప్రశంసించారు. ఈనెల 25న శనివారం జాతీయ ఓటర్ల ధినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా డా. శరత్ బెస్ట్ ఎలక్టరోల్ ప్రాక్టీస్ అవార్డును అందుకోనున్నారు. ఈ గుర్తింపు తనలో మరింత బాధ్యతను పెంచిందని తన సంతోషాన్ని పంచుకున్నారు.
No comments:
Post a Comment