Breaking News

02/01/2020

సెంటిమెంట్ పండించే పనిలో చంద్రబాబు

విజయవాడ, జనవరి 2  (way2newstv.in)
అ అంటే అన్నం కాదు, అమరావతి, మళ్ళీ అ అంటే ఇల్లాలు, పిల్లలు కాదు, అది కూడా అమరావతే. ఆయన ఊసులూ, ధ్యాసలూ, ఆశలూ అన్నీ అమరావతే అని ధర్మపత్ని నారా భువనేశ్వరి చెప్పాక తప్పక నమ్మాలేమో. చంద్రబాబు అమరావతి ఈ రెండూ విడదీయరానివేనని అంతా అంటున్నారు కూడా. ఆ మాటకు వస్తే వైసీపీ నేతలు కూడా చంద్రబాబుని అమరావతిని కలిపే చూస్తున్నారు. అంతలా అమరావతి అని కలవరించిన చంద్రబాబు అక్కడ మాత్రం తాను ఏం చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోయారు. ఈలోగా కుర్చీ ఖాళీ చేయల్సివచ్చింది. అది కదా అసలు బాధనిజానికి అమరావతి మీద చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే అక్కడ ఎందుకు ఇల్లు కట్టుకోలేదు, ఈ ప్రశ్న సామాన్యుడు నుంచి కూడా వస్తోంది. 
సెంటిమెంట్ పండించే పనిలో చంద్రబాబు

అదే సమయంలో ఓటుకు నోటు కేసులో తనను రాత్రికి రాత్రి పంపించేసిన హైదరాబాద్ లో మాత్రం వందల కోట్లు పెట్టి విలాసవంతమైన ఇల్లు చంద్రబాబు కట్టుకున్నారు. ఇక చంద్రబాబు వెనకాల వచ్చిన పవన్, జగన్ అక్కడే ఇళ్ళు కట్టుకుంటే ముఖ్యమంత్రి అయి ఉండి కూడా అద్దె ఇంట్లో కరకట్ట మీద చంద్రబాబు అక్రమ నివాసం ఎందుకు ఉంటున్నారో అన్న ప్రశ్నకు ఇప్పటికీ జవాబు లేదు. మది నిండా అమరావతి ఉన్న చంద్రబాబుకు సొంత ఇల్లు కట్టుకునేందుకు ఏవి అడ్డు వచ్చాయో సతీమణి భువనేశ్వరి అయినా చెబితే బాగుండేదేమోచంద్రబాబు అమరావతి అంటూ పుణ్యకాలమంతా గడిపేశారు, ఆయనే అయుధాలు అన్నీ ప్రత్యర్ధి వైసీపీకి అప్పగించేసారు. రాజకీయ చాణక్యుడు కూడా తప్పులు చేస్తాడనడానికి చంద్రబాబు ఒక ఉదాహరణగా చెప్పాలేమో. అన్నీ తాత్కాలిక కట్టడాలు కట్టి శాశ్వత కట్టడాలు 2050లో చూసుకోండి అంటూ చంద్రబాబు ఓ బాహుబలి మూవీ చూపిస్తేనే జనానికి మంట రేగి ఓడించేశారు. ఇపుడు యాగీ చేస్తూ అమరావతి ఉండాల్సిందేనని చంద్రబాబు అడుగుతున్న తీరు మొండి పట్టు తప్ప మరేమీ కాదేని మేధావులు సైతం అంటున్నారు.మొత్తానికి చంద్రబాబు రోడ్డున పడ్డారు. ఆయన అమరావతి బాధ కాదు కానీ డైరెక్ట్ గానే రైతులతో కలసి నిరసనలకు కూర్చున్నారు. సతీసమేంతంగా కూడా వచ్చి మరీ బోలెడు సెంటిమెంట్ కురిపిస్తున్నారు. ఇక భువనేశ్వరి తన గాజును కూడా అమరావతి కోసం విరాళంగా ఇవ్వడం మరో విశేషం. ఇవన్నీ సరే తలపండిన రాజకీయ నేతగా చంద్రబాబు ఒక మాట జగన్ ప్రభుత్వానికి చెప్పాలి. అమరావతిని రాజధానిగా అన్నీ ఇక్కడే ఉంచండి. నిధుల కధ నేను చూసుకుంటాను, అవసరమైతే కేంద్రంతో పోరాడైనా లక్ష కోట్లు నిధులు ఏపీకి మోడీ ఇచ్చేలా చూస్తానన్న ఒక్క మాట చంద్రబాబు చెప్పవచ్చుగా. అమరావతిలో రాజధాని కావాలి. కష్టాలు మాత్రం ఏపీ జనం మొత్తం పడాలి, అడ్డంగా విడదీసిన కాంగ్రెస్ తో పాటు మద్దతు ఇచ్చిన బీజేపీ కూడా జగన్ మీదనే నాలుగు రాళ్ళు వేయాలి. ఇదేమైనా ఏపీ బాగుపడే నిరసనలేనా చంద్రబాబూ. అంటే మాత్రం ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ నుంచి జవాబు రాదేమో.

No comments:

Post a Comment