విజయవాడ, జనవరవ 2 (way2newstv.in)
ఏపీలో రాజధానిపై గందరగోళం కొనసాగుతోంది. ఓవైపు అమరావతి రైతుల ఆందోళన మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. విశాఖకు రాజధానిని తరలిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఇదిలా ఉండగానే అమరావతిపై ఏపీ ప్రభుత్వానికి సంచలన ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది.అమరాతిని స్పెషల్ అగ్రికల్చరల్ జోన్‌గా మార్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం మొదలయ్యింది. అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక అగ్రికల్చర్ జోన్‌గా మార్చే అంశంపై ప్రభుత్వం దగ్గరకు ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.
వ్యవసాయ జోన్ గా అమరావతి
స్పెషల్ అగ్రికల్చరల్ జోన్‌లో రైతుల్ని భాగస్వామ్యం చేయాలని నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. రిటర్నబుల్ ప్లాట్లను రైతులకు, మిగిలిన భూముల్ని సెజ్ పరిధిలోకి తెచ్చేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.వ్యవసాయ నిపుణులు నివేదికతో కూడిన ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రోడ్లు భవనాలను యధాతథంగా ఉంచాలని సిఫార్సు చేసిన నిపుణులు.. మిగిలిన భూమిని ప్రత్యేక వ్యవసాయ జోన్‌గా వినియోగించాలని సూచించారట. SAZ ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ పూలింగ్‌తో పాటూ ప్రభుత్వ భూముల్ని సెజ్ పరిధిలోకి తెచ్చే యోచనలో ఉన్నారట. రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థికమండళ్లలో పురోగతిని పరిశీలించి నివేదిక ఇచ్చిన నిపుణులు.. విలువైన పంటలకు హబ్‌గా అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ ప్రతిపాదనలపై జగన్ ఓకే చెబితే.. అమరావతి వ్యవసాయ జోన్‌గా మారనుంది.
No comments:
Post a Comment