Breaking News

19/08/2019

నిజామాబాద్...మారుతోందోచ్....

నిజామాబాద్, ఆగస్టు 19, (way2newstv.com)
నిజామాబాద్ నగరం…. ఎటు చూసిన తవ్వకాలు, కట్టడాలు, పైప్‌లైన్ పనులు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు డైవర్షన్‌లు…. ఇవన్నీ గత కొంతకాలంగా నగర ప్రజలకు కనిపిస్తున్న దృశ్యాలు…. ఆ పనుల ఫలితం ఎలా ఉన్న ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాతో పాటు స్థానిక ఎంపి కల్వకుంట్ల కవితను నగర పాలక వర్గాన్ని ఎవరినీ వదిలిపెట్టకుండా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎదురవుతున్న అసౌకర్యం అలాంటిది కావడం. అందుకు కారణంగా కాగా అవన్నీ ఎమ్మెల్యే గణేష్‌గుప్త వద్దకు ఫిర్యాదు అందుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇదే అదునుగా బిజెపి, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలోను విమర్శల హోరు సాగుతూనే ఉంది.
నిజామాబాద్...మారుతోందోచ్....

ఇదంతా ఒకవైపు మాత్రమే కనిపించే, వినిపించే అంశం కాగా వాటన్నింటిని కొట్టిపారేస్తూ, విమర్శలను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. నిజానికి ఆయా పనులను చేపట్టేందుకు ముందే ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే  మీడియా సమావేశం పెట్టి తన మనోగతాన్ని వినిపించారు. అర్బన్‌లో మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లు పాడవుతున్నాయని అధికారులు తనను వారించినా తాను అంగీకరించలేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం భూగర్బంలో తాగునీటి పైప్‌లైన్లు ఉన్నా అవి భవిష్యత్తు అవసరాలు తీర్చలేవని, అద్బుత పథకం అవకాశంగా వచ్చినప్పుడు వినియోగించుకోవాల్సిందేనని బిగాల పట్టుబట్టారు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ భూ గర్భ మురికి నీటి కాల్వల పనులు, భగీరథ పనులతో పాటు నగర సుందరీకరణ పనులను ఒకేసారి చేపడుతున్నామని, ప్రజలకు కొంతకాలం అసౌకర్యం తప్పదని స్పష్టం చేశారు. కొంతకాలం అసౌకర్యం  ఎదురైనా నగరాన్ని మోడల్  సిటీగా మార్చే అవకా శం ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు. అయితే అధికారులకు, ఎమ్మెల్యే పనుల కొనసాగింపుకే మొగ్గు 
చూపారు. పాలకవర్గం తనకు అనుకూలంగా ఉండ టం స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారం ఎమ్మెల్యేకు కలిసొచ్చినట్లైంది. వరుసగా 2016-17,2017-18, 2018-19 వార్షిక సంవత్సరాలుగా రూ. 100 కోట్ల చొప్పున మొత్తం రూ. 300 కోట్లను నగర పనులకు సాధించారు. ఇప్పటికే రూ. 200 కోట్ల పనులకు శ్రీకారం చుట్టగా మరో రూ.వంద కోట్లకు పరిపాలన ఆమోదం రావాల్సి ఉంది. నిజానికి గతంలో సీనియర్ నేతగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో భూగర్బ మురికి కాల్వల పనులకు శ్రీకారం చుట్టిన ధర్మపురి శ్రీనివాస్ ఆ పనుల కారణంగానే రాజకీయంగా కోలుకోలేని దెబ్బతినగా ఆ పనులు వద్దంటూ బిగాలకు అనుచరులు వారించేందుకు యత్నించారు. అయితే పనులు పూర్తి చేసి తీరుతానని, విమర్శకులే ప్రశంసలు కురిపిస్తారంటూ ఆయన మొండిగా వాదిస్తూ వస్తున్నారు. చివరికి నగరమంతా తవ్వకాలు చేపట్టి భూగర్బ మురికి నీటి కాల్వల పనులను దాదాపు పూర్తి చేశారు. ఇక్కడే వేసవికాలంలో తవ్వకాల వల్ల వచ్చిన దుమ్మ తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే అవేమి బిగాల దూకుడుకు అడ్డుకట్ట వేయకపోగా మిషన్ భగీరథ పనులను సైతం పూర్తి చేయించారు. ఆయా పనులను రూ. 171 కోట్లను ఖర్చు చేయగా అమృత పథకం కింద రూ. 98 కోట్లను ఖర్చు చేస్తున్నా రు. నగరంలోని 8 చోట్ల భారీ తాగునీటి ట్యాంకుల నిర్మాణానికి రూ. 20 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు చివరి దశకు చేరగా నగర ప్రజల చిరకాల డిమాండ్ అయిన రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ప్రారంభించారు. ఈ విషయం లో జిల్లా కలెక్టర్, ఆర్‌అండ్‌బి, పోలీస్, ఇతర శాఖ అధికారులతో చర్చించి వెనకడు గు వేసిన ఎమ్మెల్యే అంగీకరించలేనట్లు తెలిసింది. వీటికి తోడు నగరంలో ప్రధాన రోడ్డు మార్గాల్లో రోడ్డు విభాగినిని అందంగా మార్చే పనులు ఊపందుకున్నాయి. ప్రత్యేక రాతికట్టడాలు నగర ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పులాంగ్, కలెక్టరేట్ మొదలుకొని నెహ్రుపార్క్, గాంధీచౌక్ అన్ని కూడళ్లు ఆకర్షణీయంగా తయారు కానున్నాయి. వివిధ నగరాలను కలిపే రోడ్డు మార్గాల్లో దాదాపు 20 కిలో మీటర్ల మేర అందమైన కట్టడాలతో డివైడర్ రూపుదిద్దుకునే పనులు వేగవంతయమ్యాయి. ఓ వైపు అందమైన రోడ్లు, 24 గంటల తాగునీరు, మురికినీరు కనిపించని భూగర్బకాల్వలను పూర్తి చేస్తునే ఏకకాలంలో ఆహ్లదాన్ని పెంచే సుందరీకరణ పనులు పూర్తి చేసి తీరాలన్నదీ ఎమ్మెల్యే బిగాల మొండి పట్టుదలగా కనిపిస్తోంది

No comments:

Post a Comment