హైదరాబాద్ ఆగష్టు 19 (way2newstv.in)
కలెక్టర్ల సదస్సు జరగబోతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆకస్మికంగా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇప్పటి వరకూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న రాజేశ్వర్ తివారిని బదిలీ చేశారు.
ఆకస్మికంగా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆయనను అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ సీఎస్ గా నియమించారు. రెవెన్యూ (రెవెన్యూ, ఎక్సయిజ్, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ గా సోమేశ్ కుమార్ ను నియమించారు. అదే విధంగా ఆయనకు సీసీఎల్ఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గా ఉన్న నీతుకుమారి ప్రసాద్ ను బదిలీ చేసి ఆ స్థానంలో రఘునందన్ రావు ను నియమించారు.
No comments:
Post a Comment