Breaking News

04/06/2019

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బిజెపి భారీ వ్యూహం...


న్యూఢిల్లీ,జూన్ 4 (way2newstv.in)
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బిజెపి భారీ వ్యూహం రచించింది. అందులో భాగంగా తెలంగాణలో 2024కి అధికారం చేపట్టే విధంగా కిషన్రెడ్డిని కేంద్ర సహాయ మంత్రిగా నియమించడం జరిగింది. అలాగే 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారం చేపట్టే దిశగా ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా ద్వయం ప్రణాళిక రూపొందించుకుంటుంది. 


దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బిజెపి భారీ వ్యూహం... 
దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వ్యూహరచన చేస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వారు కమ్మ సామాజిక నేతలు కావడం అందులో కొంతమంది బిజెపి వైపు చూడటం చంద్రబాబు నాయుడుకి మింగుడు పడని అంశం. ఈ క్రమంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, బుచ్చయ్య చౌదరిలతో పాటు పార్టీ ముఖ్య నేతలైన చింతమనేని ప్రభాకర్ , పరిటాల శ్రీరామ్, జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఇంతకుముందు సుజనా చౌదరి, సీఎం రమేష్, కేశినేని నాని ఇలాంటి వాళ్లను బిజెపి టార్గెట్ చేసింది.

No comments:

Post a Comment