Breaking News

12/03/2019

పదవ తరగతిలో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి

విద్యార్థులకు  పరీక్ష సామగ్రి పంపిణి  చేసిన మార్కెట్ చైర్మన్ 
నంగునూరు, మార్చి 12 (way2newstv.in)
పదవవ తరగతిలో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి సూచించారు. మంగళవారం గట్లమాల్యాల గ్రామంలోని  ప్రభుత్వ పాఠశాలలో10 వ తరగతి చదువుతున్నల  55 మంది విద్యార్థిని  విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎడ్ల సోమిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ  పదిలో 10/10 కి మార్కుల సాదించి పాఠశాలను జిల్లాలో  ఉన్నత స్థాయిలో  ఉంచాలని కోరారు. కేవలం 20 రోజులు తలవంచుకోని చదవండి. 


పదవ  తరగతిలో విద్యార్థులు  ఉన్నత లక్ష్యాలు సాధించాలి

జీవితంలో తలెత్తుకొని జీవిస్తారని అన్నారు. పరీక్షలు పూర్తి అయే వరకు మొబైల్స్ ,టీవీ కి దూరంగా ఉండాలని సూచించారు.  తల్లిదండ్రులను తలెత్తుకునెల విద్యార్థులు కష్టపడి మంచిమార్కులు సాధించాలని సూచించారు. విద్యని బోధించిన  ఉపాధ్యాయుల పేరును నిలపెట్టాలని తెలిపారు. 10/10 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు  తన్నీరు హరీశ్ రావు చేతుల మీదుగా 25000 రూపాయలు తో పాటు మెడల్స్  ఇపిస్తానని ఎడ్ల సోమిరెడ్డి  విద్యార్థులకు సూచించారు.  గత పది సంవత్సరాల నుండి స్వంత నిధులతో 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా మంచిమార్కులు సాధించి పాఠశాలకు మంచిపేరును తీసుకురావాలని  ఏయంసి చైర్మన్  ఎడ్ల సోమిరెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో :- 
పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. అశోక్ , పిఎసిస్ చైర్మన్ కోల రమేశ్ గౌడ్ , గ్రామ సర్పంచ్ తిప్పని రమేష్, లోకటి  రాజేశం,  కర్ణకంటి వేణు,ఆకుబత్తిని రాము, బుద్ధి తిరుపతి, కె ప్రవీణ్, పుట్ట వెంకట్, ఎర్ర బాబు, చేర్యాల రాకేష్ , పాఠశాల టీచర్స్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు...

No comments:

Post a Comment