రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి: మార్చి 12 (way2newstv.com)
ఈ నెల 13వ తేదీన కామారెడ్డి జిల్లా లోని నిజాంసాగర్ మండలం మాగి గ్రామం శివారులో జరగనున్న జహీరాబాద్ పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సభ ను విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి శాసనసభ స్థానాల నుండి నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలను కార్యకర్తలకు వివరిస్తారని తెలిపారు.
జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి ఎన్నికల సన్నాహక సభ ను విజయవంతం చేయాలి
ఈరోజు నిజాంసాగర్ మండలం లోని సభాస్థలి వద్ద జుక్కల్ శాసన సభ్యులు హనుమంతు షిండే,ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, దేశాయిపేట సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మరియు సురేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సభ జరిగే ఏర్పాట్లను పరిశీలించి సమావేశం నిర్వహించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తెరాస పార్టీ ముఖ్య నాయకులు , శాసనసభ్యులు హాజరు కానున్నారని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 20 వేల మంది తెరాస కార్యకర్తలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. సభాస్థలి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అంజిరెడ్డి,స్థానిక నాయకులు దుర్గా రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment