విజయవాడ జనవరి 25 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 39వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడం, వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిన నేపథ్యంలో రైతులు, మహిళలు పాదయాత్ర చేపట్టారు.
అనంతారం వెంకన్న కొండకు రైతుల మహా పాదయాత్ర
మందడం నుంచి అనంతారం వెంకన్న కొండకు రైతులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు రాజధాని ప్రాంత గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు తరలివచ్చారు. మందడం నుంచి వెలగపూడి, తుళ్లూరు మీదుగా వెంకన్న కొండకు వెళ్లి రైతులు మొక్కులు చెల్లించుకోనున్నారు.
No comments:
Post a Comment