రంగారెడ్డి జనవరి 31 (way2newstv.in)
రాజేంద్రనగర్ లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగిన రెండవ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గోన్నారు. రాజస్థాన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గేహలాట్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానీయ ముఖ్య అతిథిలుగా హజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ లో 2016.2019 మధ్య డిగ్రీ. పిజి. పీహెచ్డీ. పూర్తి చేసుకున్న సుమారు 400 మంది విద్యార్థిని విద్యార్థుల కు గవర్నర్ చేతులమీదుగా పట్టాలు అందుకున్నారు.
గ్రామాల్లో విస్తృతంగా సేవలు అందించాలి
గవర్నర్ మాట్లాడుతూ పశు వైద్య కళాశాల కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. మీరు ఎంచుకున్న విద్య, సమాజంలో ఎంతో ఉన్నతమైనది. నేను ఒక డాక్టర్ గా ప్రజలకు సేవలందించాను కానీ మీరు నోరు లేని జీవాలకు వైద్యం అందిస్తున్నారు అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. పట్టాలు అందుకున్న తర్వాత మీరు గ్రామాల్లోకి వెళ్లి మరింత విస్తృతంగా సేవలు అందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం పై ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుంది.వ్యవసాయానికి మూలకారణం పశువులు వీటికి మెరుగైన వైద్య సేవలు అందించి రైతులు మన్ననలు పొందాలని ఆమె అన్నారు. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన యూనివర్సిటీ బోధన బోధనేతర సిబ్బంది కి మరియు వైస్ ఛాన్సలర్ కు అభినంధనలని గవర్నర్ అన్నారు.పట్టాలు అందుకున్న విద్యార్థిని విద్యార్థుల కు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
No comments:
Post a Comment