ములుగు జనవరి 31 (way2newstv.in)
మేడారం సమ్మక్క...సారాలమ్మ జాతర విధుల్లో అలసత్వం తగదని సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అధికారులను ఆదేశించారు.శుక్రవారం మేడారం జాతరలో శానిటేషన్ పనులను జిల్లా పంచాయతీ అధికారి తో జె.సి. ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. తొలుత ఘాటును సందర్శిస్తూ స్నానాల గదుల పరిశుభ్రత ను పరిశీలించారు. పారిశుధ్యం మెరుగు కొరకు చేపడుతున్న పనులను జేసికి వివరించారు.
జాతర విధుల్లో అలసత్వం తగదు
అధికారులు కూడా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. జంపన్నవాగుకు నీటిని విడుదల చేసినందున భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని, ఊరట్ఠం నుండి జంపన్నవాగు మీదుగా రెడ్డిగూడెం వరకు మహిళల కొరకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను నిరంతరం పరిశుభ్ర పరిచేందుకు 24 గంటల విధులతో సిబ్బందిని నియమించాలని, పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని నీటిపారుదల డి.ఈ. గిరి ని ఆదేశించారు. అనంతరం ఘాట్ పక్కనే ఉన్న కళ్యాణకట్ట ను ఆమె సందర్శించారు. కల్యాణ కట్టను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. జెసి వెంట జిల్లా పంచాయతీ అధికారి కె.వెంకయ్య, నీటిపారుదల శాఖ డి.ఈ. గిరి తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment