Breaking News

11/01/2020

బాబుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ సెగ

విజయవాడ, జనవరి 11 (way2newstv.in)
ఇప్పటికే మూడు రాజధానుల చిచ్చుతో చంద్రబాబు పరేషాన్ అవుతున్నారు. అమరావతి కావాలంటున్న బాబుకు అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర జనం నుంచి ఆగ్రహావేశాలు ఎదురవుతున్నాయి. ఈ మధ్యనే విజయనగరం పర్యటన పెట్టుకుని కూడా బాబు రద్దు చేసుకున్నారు. ఈ వేడిలో ఏం జరుగుతుందో అని తమ్ముళ్ళు సూచించిన మీదట ఆయన అలా ఆగిపోయారు. అయినా కూడా అమరావతి పాటనే బాబు పాడుతున్నారు. ఇది ఉత్తరాంధ్ర వాసులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న నాయకులు బాబు వైఖరిని తప్పుపడుతున్నారు. విశాఖ రాజధానికి అడ్డం పడితే బాబుని ఈ ప్రాంతంలో అడుగుపెట్టనీయమని కూడా శపధం చేస్తున్నారు.చంద్రబాబు తరచూ చెప్పే మాట ఒకటి ఉంది. 
బాబుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ సెగ

ఉత్తరాంధ్ర ప్రజలు మంచి వారు, అమాయకులని, మరి ఆ అమాయకత్వం వల్లనే వారికి దక్కాల్సినవి కూడా దక్కకుండాపోయాయి. ఇక్కడి ప్రజలు శాంత స్వభావులు అని చంద్రబాబు అంటూంటే ఇపుడు కోపం ఏంటో చూపించాలనుకుంటున్నారుట. ఉమ్మడి ఏపీలో ఎటువంటి ప్రయోజనం లేదు, పోనీ ఏపీ ముక్కలు అయితే ఉత్తరాంధ్ర దశ తిరుగుతుందేమోనని ఆశపడ్డారు. దేశమంతా విభజన ఏపీకి విశాఖే కొత్త రాజధాని అంది, కానీ చంద్రబాబు మాత్రం అమరావతి అంటూ కొత్త సృష్టి మొదలెట్టారు. తన తొలి మంత్రివర్గ సమావేశానికే కాదు, గత అయిదేళ్ళలో అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు చోటు ఇచ్చిన విశాఖ అంటే ఇపుడు విషం చిమ్ముతున్నారు. ఏం విశాఖ రాజధాని కాకూడదా చంద్రబాబూ అంటున్నారు నిన్నటి వరకూ టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమన్.విశాఖను రాజధాని చేయమని తాను 2014లోనే చంద్రబాబుకు చెప్పానని రహమాన్ అంటున్నారు. తన మాట పెడచెవిన పెట్టి పచ్చని పంటలు పండే పొలాలలో చిచ్చు రేపిన చంద్రబాబు ఇపుడు రైతులు రోడ్డున పడేలా చేశారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రెడీమేడ్ క్యాపిటల్ గా విశాఖ ఉంటే చంద్రబాబు మాత్రం స్వార్ధంతోనే అలా చేశారని రహమాన్ గట్టిగా తగులుకుంటున్నారు. అయిదేళ్ల తరువాత కొత్త ప్రభుత్వం జరిగిన తప్పిదాలను సరిచేసే ప్రయత్నంలో విశాఖను రాజధానిగా చేస్తానంటే చంద్రబాబు అడ్డం తిరిగడం ఏంటి అంటూ రహమాన్ మండిపడుతున్నారు. విశాఖ రాజధాని అనకుండా చంద్రబాబు ఈ ప్రాంతానికి వస్తే అడుగు మోపనీయమని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.చంద్రబాబుకు ఉత్తరాంధ్ర బాగుపడడం ఇష్టం లేకపోతే అసలు ఈ వైపే రావద్దు అంటున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తాను ఈ మాట స్పీకర్ గా చెప్పడంలేదని, బడుగు బక్క జీవులున్న ఉత్తరాంధ్ర వాసిగా చెబుతున్నానని ఆయన అంటున్నారు. చంద్రబాబు తాను చేయకపోయినా జగన్ చేస్తానంటున్నారని, దానికి స్వాగతించాల్సింది పోయి విషం చిమ్మడమేంటని తమ్మినేని అంటున్నారు. ఇక్కడ ప్రజల బతుకులు వలసలతో సతమతమవుతున్న జీవితాలను చూసి కూడా చంద్రబాబు ఇలా అంటున్నారంటే ఆయన్ని ఇక్కడకు రానీయకపోవడమే మంచిదని తమ్మినేని కౌంటర్లేస్తున్నారు.విశాఖను రాజధానిగా చేసుకుంటే పదమూడు జిల్లాల అభివృధ్ధికి చోదక శక్తిగా మారుతుందని మేధావులు కూడా అంటున్నారు. విశాఖకు ఆ సామర్ధ్యం ఉందని, ఇప్పటికే పది మొదటి నగరాల జాబితాలో ఉన్న విశాఖ జీడీపీలో కూడా పెద్ద నగరాలతో పోటీ పడుతోందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. విశాఖను రాజధానిగా చేస్తే శరవేగంగా ప్రగతి బాట పట్టడం ఖాయమని కూడా సూచిస్తున్నారు. విశాఖ ఆసియా ఖండంలోనే అగ్రగామి సిటీగా మారుతుందని కూడా చెబుతున్నారు. కాస్మోపాలిటన్ సిటీగా ఉన్న విశాఖను మినీ ఇండియాగా పేర్కొంటారని, ఒక వర్గానికి ప్రాంతానికి, అతీతంగా అందరూ తమదే అనుకునే రాజధాని ఇదే అవుతుందని కూడా విద్యావంతులు అంటున్నారు. మరి ఈ విషయంలో అడ్డం తిరిగితే మాత్రం రాజకీయ నాయకుల జాతకాలు కూడా మారిపోతాయని హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment