Breaking News

11/01/2020

ఆకలిని తీర్చి ప్రాణాలలు కాపాడిన తల వెంట్రుకలు

చెన్నయ్ జనవరి 10  (way2newstv.in)
ఇది హృదయ విదారక ఘటన.ఆకలిని తీర్చడమే కాకుండా  ఓ తల్లి ప్రాణాలను కాపాడాయి తల వెంట్రుకలు.రెక్కాడితే గాని డొక్కాడదు వారికి. అప్పుల ఊబిలో ఇరుకున్న ఇంటి పెద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ముగ్గురు పిల్లల పోషణ ఆమెకు భారంగా మారింది. కూలీ పని దొరకడం కష్టమైంది. అప్పుల వాళ్లు ఇంటికి రావడం తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. కనీసం రూపాయి కూడా వారి దగ్గర లేదు. చివరకు ఏం చేయాలో తోచక.. తన తల వెంట్రుకలను అమ్ముకుని పిల్లల ఆకలిని తీర్చింది. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసింది.వివరాల్లోకి వెలితే...తమిళనాడులోని సేలంకు చెందిన సేల్వం, ప్రేమ(31) దంపతులకు ముగ్గురు సంతానం. ఐదు, మూడు, రెండేళ్ల సంవత్సరాలు ఉన్న పిల్లలు వారికి ఉన్నారు. సేల్వం, ప్రేమ.. స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలో పని చేస్తుండేవారు. ఈ క్రమంలో తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆకలిని తీర్చి ప్రాణాలలు కాపాడిన తల వెంట్రుకలు

దీంతో సేల్వం అప్పు చేశాడు. వడ్డీతో కలిపి ఆ అప్పు రూ. 2.5 లక్షల దాకా చేరింది. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. కొందరు మోసగించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సేల్వం ఏడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.సేల్వం ఆత్మహత్యతో ప్రేమకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ముగ్గురు పిల్లల పోషణ భారంగా మారింది. అప్పులు ఇచ్చిన వాళ్లు వేధిస్తున్నారు. తినడానికి కూడా తిండి లేక తీవ్ర అవస్థలు పడింది. పైసలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన ఇంటి ముందు వెళ్తున్న ఓ వెంట్రుకల వ్యాపారిని ఆపింది. తన వెంట్రుకలు ఇస్తానని చెప్పింది ఆమె. 150 రూపాయాలకు ప్రేమ తన తల వెంట్రుకలను ఆ వ్యాపారికి అమ్మేసింది. 100 రూపాయాలతో పిల్లలకు ఆహారం తెచ్చి పెట్టింది. మిగతా రూ.50తో విషం కొనుగోలు చేసేందుకు వెళ్తే దుకాణాల యజమానులు ఇవ్వలేదు. దీంతో ఇంటి ముందు ఉన్న గన్నేరు విత్తనాలను చూర్ణంగా చేసి మింగడానికి ప్రయత్నించింది ప్రేమ. విషయాన్ని గమనించిన ఆమె సోదరి అడ్డుకుంది. మొత్తానికి ఆమె ప్రాణాలను కాపాడింది సోదరి.ఫేస్‌బుక్‌ పోస్టు.. ప్రేమలో ధైర్యంప్రేమ దీనగాథను జి. బాల అనే మానవతావాది ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో ప్రేమ కష్టాలను తెలుసుకున్న మానవతామూర్తులు.. రూ. 1.45 లక్షల దాకా సహాయం చేశారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రేమకు వితంతు పెన్షన్‌ను మంజూరు చేసింది. ఇటుకల బట్టీలో ఉపాధి కల్పిస్తానని బాల స్నేహితుడు ప్రభు ముందుకొచ్చాడు. ఈ క్రమంలో ప్రేమకు ఆత్మ విశ్వాసం పెంపొందింది. ఆత్మహత్య గురించి మళ్లీ ఆలోచించను అని ప్రేమ చెప్పింది. తన ముగ్గురు పిల్లలకు మంచి విద్య ఇవ్వాలని ప్రేమ నిర్ణయించుకుంది.కాగా..జి. బాల చిన్న వయసులో ఉన్నప్పుడు అతని అమ్మ కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక రోజు తినడానికి తిండి లేక బాల అమ్మ తీవ్ర ఇబ్బందులు పడింది. ఇంట్లో ఉన్న న్యూస్‌పేపర్‌ అమ్మితే రూ. 4 వచ్చాయి. దాంతో బియ్యం కొని అన్నం వండుకుని తిన్నారు. ఆ తర్వాత బాల అమ్మ ఆత్మహత్యాయత్నం చేయగా బంధువులు అడ్డుకుని ప్రాణాలు కాపాడారు. ఒక వేళ అమ్మ ఆ రోజు ఆత్మహత్య చేసుకుని ఉంటే ఇవాళ తాను ఈ స్థాయిలో ఉండకపోయే వాడినని బాల పేర్కొన్నాడు.

No comments:

Post a Comment