నల్గోండ డిసెంబర్ 2, (way2newstv.in)
నల్గొండ సమీపంలో ఒక ప్రైవేటు బస్సు దగ్దం అయింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (ఏపీ 36 ఎక్స్ 3654) మంటల్లో పూర్తిగా ఆహుత్యింది. ఆదివారరం 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు, నార్కట్పల్లి - అద్దంకి రహదారిపై ప్రయాణిస్తుండగా, చర్లపల్లి దగ్గరికి రాగానే ఒక్కకసారిగా ఇంజన్ లో మంటలు చెలరేగాయి.
బస్సు దగ్దం…ప్రయాణికులు క్షేమం
ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్, వెంటనే బస్సును ఆపి, ప్రయాణికులను దించేశాడు. ఆపై నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సంతా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సును గుంటూరుకు చెందిన గాయత్రీ ట్రావెల్స్ కు చెందినది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు.
No comments:
Post a Comment