భవనం కూలి 15 మంది మృతి
చెన్నై డిసెంబర్ 2 (way2newstv.in)
తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని చెన్నై, కడలూరు తూత్తుకూడీ, తిరువల్లూరు కాంచీపురం సహా 8 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్ష బీభత్సానికి కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో నాలుగు భవనాలు కూలాయి.
తమిళనాడులో కుంభవృష్టి
ఈ ఘటనల్లో ఇళ్లలో నిద్రిస్తున్న 15 మంది మృతి చెందారు. భవనాల శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలాల వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ముందస్తు వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. చెన్నూ నగరంలో 176 పునరావస శిబిరాలకు ఏర్పాటు చేసారు. నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి పడవలు కుడా సిద్దం చేసారు. పొరుగున వున్న పుదుచ్చేరిని కుడా భారీ వర్షాలు అతలాకుతలం చేసాయి. వర్షాల దృష్ట్యా పుదుచ్చేరితో పాటు ఐదు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఈరోజు సెలవు ప్రకటించారు. ఈ నెల 15నుంచి మరోసారి వర్ష సూచన ఉందని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
No comments:
Post a Comment