Breaking News

10/12/2019

స్పందన వేదికను పరిశీలించిన కలెక్టర్

ఒంగోలు, డిసెంబర్ 10, (way2newstv.in):
ఒంగోలు కలెక్టరేట్ లో స్పందన ప్రజాసమస్యల పరిష్కార వేదికను సుందరంగా తయారు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులు ఆదేశించారు. మంగళవారం స్థానిక ఒంగోలు ప్రకాశం భవనంలో నూతనంగా నిర్మిస్తున్న స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుదూర ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు అనుకూలంగా కలెక్టరేట్ లో 500 మంది ప్రజలు కూర్చునే విధంగా వేదికను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. 
స్పందన వేదికను పరిశీలించిన కలెక్టర్

స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఒంగోలు గిత్తలు, వెలగొండ ప్రాజెక్ట్, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లు కనబడేవిధంగా సభావేదిక  వెనుక రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. స్పందన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రజలకు అర్జీలు స్వీకరించడం, నమోదు చేసుకోవడం వంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.  ఈకార్యక్రయంలో ఎస్.సి.కార్పొరేషన్ డి.ఇ.ఇ.భాస్కర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment