Breaking News

10/12/2019

అంధ క్రికేటర్ ను అభినందిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ డిసెంబర్ 10  (way2newstv.in)
అంధుల జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వి.మాధవులు ను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.డిసెంబర్ 2 నుండి 4 వ తేదీ వరకు కాన్పూర్ లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఇండియా, నేపాల్ ల మధ్య ఒన్డే మ్యాచ్ లోను, డిసెంబర్ 6 నుండి 8 వరకు జరిగిన ఇండియా-నేపాల్ ల మధ్య జరిగిన టి-20 క్రికెట్ మ్యాచ్ లో మాధవులు ఆడాడు. 
అంధ క్రికేటర్ ను అభినందిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల లింగనపల్లి గ్రామానికి చెందిన మాధవులు  జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొని, సౌత్ జోన్, నేషనల్ క్రికెట్ టోర్నీ, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, చెన్నై, బెంగుళూర్, కేరళ తో పాటు, పలు నగరాలలో  క్రికెట్ ఆడి బౌలర్ గా, బ్యాట్సమెన్ గా ప్రతిభను చాటాడు.  మాధవులు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడి రాష్ట్రానికి మంచి పేరు తేవాలన్నారు మంత్రి సూచించారు.

No comments:

Post a Comment