Breaking News

16/12/2019

ఇది పిరికి పంద ప్రభుత్వం: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ డిసెంబర్ 16 (way2newstv.in)
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన నిప్పును రాజేసింది.ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం విదితమే. యూనివర్సిటీలో నిన్న జరిగిన ఘటనలపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పిరికి పంద ప్రభుత్వం అని ఆమె విమర్శించారు. 
ఇది పిరికి పంద ప్రభుత్వం: ప్రియాంక గాంధీ

యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి విద్యార్థులపై దాడి చేయడం దారుణమన్నారు. ఉద్రిక్తల సమయంలో ప్రభుత్వం.. ప్రజల బాధలను వినాల్సిన అవసరం ఉంది. కానీ దాడులు చేయడం సరికాదన్నారు. ఈశాన్య రాష్ర్టాలతో పాటు ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలోని విద్యార్థులను, జర్నలిస్టులను బీజేపీ ప్రభుత్వం అణిచివేస్తోందని ప్రియాంక ధ్వజమెత్తారు. యువత గొంతును అణిచివేయలేమని మోదీకి వార్నింగ్‌ ఇచ్చారు ప్రియాంక. ప్రజా గొంతుకను చూసి బీజేపీ ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఈ ప్రభుత్వం యువతను నియంతృత్వంతో అణిచివేయాలని చూస్తుందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

No comments:

Post a Comment