Breaking News

16/12/2019

మార్కులు, ర్యాంకులు కన్నా నైతిక విలువలు ముఖ్యం: హరీష్‌ రావు

సంగారెడ్డి డిసెంబర్ 16 (way2newstv.in)
విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు ముఖ్యమే.. వాటి కన్నా నైతిక విలువలు ఇంకా ముఖ్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. విద్యార్థులు సోషల్‌ మీడియా, టీవీలు, సినిమాలకు దూరంగా ఉండి.. చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని మంత్రి సూచించారు. పటాన్‌చెరు టౌన్‌లో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలికలు) భవనాన్ని మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి పటాన్‌చెరును ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారు చేశారు. 
మార్కులు, ర్యాంకులు కన్నా నైతిక విలువలు ముఖ్యం: హరీష్‌ రావు

పిల్లలు ఆడుకునేందుకు మంచి స్టేడియంను కూడా ఏర్పాటు చేశారని కొనిడాయరు. పదో తరగతిలో వచ్చిన ఫలితాల మాదిరిగానే ఇంటర్‌, డిగ్రీలో వందకు వంద శాతం ఫలితాలు రావాలన్నారు మంత్రి. మార్చి నాలుగో తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.విద్యార్థుల దశ, దిశ మార్చేది ఇంటర్‌, డిగ్రీ మాత్రమే అని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పిల్లల్లో చదువులతో పాటు నైతిక విలువలు పెంపొందించాలి. సంప్రదాయాలు నేర్పించి, సామాజిక స్పృహను పెంచాలని హరీష్‌ రావు సూచించారు. ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఉన్నత వ్యక్తులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. బాలికలకు మహిళా పోలీసు అధికారులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలన్నారు మంత్రి.

No comments:

Post a Comment