Breaking News

16/12/2019

బతుకమ్మ ముగ్గులు పుస్తకావిష్కరణ చేసిన మంత్రి

వనపర్తి డిసెంబర్ 16  (way2newstv.in)
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ మీద వందమంది కవులు రాసిన "బతుకమ్మ మొగ్గలు" కవితా సంకలనాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం మంత్రి స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో ఈ కవితాసంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను,ప్రాముఖ్యతను వందమంది కవులు మొగ్గల ప్రక్రియలో ఆవిష్కరించడం గొప్ప విషయమన్నారు.
బతుకమ్మ ముగ్గులు పుస్తకావిష్కరణ చేసిన మంత్రి

ఒక్కొక్కరు తమదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో మొగ్గలను రచించడం విశేషమన్నారు. ఈ బతుకమ్మ మొగ్గలకు సంపాదకత్వం వహించిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, డాక్టర్ గుంటి గోపి, సృజామి లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.వీరయ్య, కె.నారాయణ రెడ్డి,కొప్పోలు యాదయ్య, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment