న్యూఢిల్లీ డిసెంబర్9 (way2newstv.in)
సోమవారం ఉదయం కుడా అదే భవనంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 43మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఉత్తర ఢిల్లీలోని రాణి ఝాన్సీరోడ్డులో అనాజ్ మండీ ప్రాంతంలో సోమవారం ఉదయం మరోసారి మంటలు ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని 4 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకే భవనంలో రెండు సార్లు సంఘటనలు జరగడం కలకలం రేపింది.
No comments:
Post a Comment