Breaking News

02/12/2019

కాలేజ్ నగర్ లో ప్రారంభమైన జవహర్లాల్ నెహ్రూ గణితం సైన్స్ ప్రదర్శన .

అసిఫాబాద్ డిసెంబర్ 2 (way2newstv.in)  
కాగజ్ నగర్ లో అట్టహాసంగా ప్రారంభమైన జవహర్లాల్ నెహ్రూ గణితం సైన్స్ మరియు పర్యావరణ ప్రదర్శన కార్యక్రమం. సోమవారం స్థానిక ఫాతిమా కాన్వెంట్ పాఠశాల లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ రాంబాబు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జెసి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి పాఠశాలకు సైన్స్ లాబొరేటరీ పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. నియోజకవర్గంలో రూ.1.17 కోట్ల నిధులతో పూర్తిస్థాయిలో సైన్స్ ల్యాబ్ లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 
కాలేజ్ నగర్ లో  ప్రారంభమైన  జవహర్లాల్ నెహ్రూ  గణితం సైన్స్ ప్రదర్శన . 

వీటిని విద్యార్థులు చక్కగా సద్వినియోగం  చేసుకోవాలని అని సూచించారు. జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ విద్యార్థులకు మానవీయ సంబంధాలను తప్పకుండా ఉపాధ్యాయులు నేర్పించారు, మానవరహిత పరికరాలను తయారుచేస్తూ మానవీయ సంబంధాలు లేకపోవడంతో అంతా తప్పిదాలు జరుగుతున్నట్లు వివరించారు. ఈ విషయంలో అంత స్పందించి విద్యార్థి దశ నుండి సమాజంలో ఉండే మానవీయ లక్షణాలు తదితర అంశాలపై కూలంకుషంగా వివరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. జెడ్పి చైర్మన్ కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ కలలు కనాలి వాటి లక్ష్య సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మారుమూల ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు రాణించడం చాలా గొప్ప విషయమన్నారు. విద్యారంగంలో పూర్తిగా అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి  పాఠశాలకు ల్యాబ్ పరికరాలు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకొని జిల్లా రాష్ట్ర స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. అడిషనల్ ఎస్పీ వై.వి.యస్ సుధీంద్ర విద్యార్థి దశ నుంచి చక్కటి చదువులు చదువుకోవాలని ఉన్నత ఆశయాలు ఉన్నప్పుడే ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చు అన్నారు .ఏ పనినైనా కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని సూచించారు. జిల్లా డిఈఓ పణిని మాట్లాడుతూ 47వ అ జవహర్లాల్ నెహ్రూ గణితం సైన్స్ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం చాలా హర్షణీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు చక్కగా వినియోగించుకుని జిల్లాస్థాయి రాష్ట్రస్థాయిలో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి ఎంఈఓ బిక్షపతి, చీఫ్ ప్లానింగ్ అధికారి కృష్ణయ్య, పాఠశాల కరస్పాండెంట్ స్మిత తో పాటు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment