హైదరాబాద్ డిసెంబర్ 2 (way2newstv.in)
ప్రగతి భవన్ లో పెంపుడు కుక్కలకు ఇచ్చే విలువ తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వడం లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అన్నారు. హుజుర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలు వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ ఆడపిల్ల మరణం పై స్పందించడానికి మూడు రోజులు పడుతుందా? అని ఆమె ప్రశ్నించారు.
పెంపుడు కుక్కలకు ఇచ్చే విలువ తెలంగాణ సమాజానికిలేదా? విజయశాంతి
జాతీయ మీడియా ప్రశ్నించిన తరువాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పేరుతో ఆయన చేతులు దులుపుకున్నారని విజయశాంతి అన్నారు. హైదరాబాద్ దిశ ఘటన పై ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంటే ఎట్టకేలకు 72 గంటలకు సిఎం కేసీఆర్ మాట్లాడటం విడ్డురంగా ఉందని ఆమె అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల పై ఎలాంటి చర్యలు ఉంటాయో చెప్పలేదని విజయశాంతి అన్నారు.ఆర్టీసీ కి ఆదుకుంటామని ఇప్పుడు చెప్పిన సీఎం..హైకోర్టు తీర్పు వచ్చిన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆర్టీసీని కాపాడే నాధుడే లేడు అన్న కేసీఆర్… ఆర్టీసీని కాపాడేందుకు రెండు నెలల సమయం ఎందుకు పట్టింది? అంటూ విజయశాంతి ప్రశ్నల వర్షం గుప్పించారు.
No comments:
Post a Comment