Breaking News

02/12/2019

నరసింహ స్వామి పుణ్య క్షేత్రం లో 4 రాజ గోపురాలకు భూమి పూజలు

కౌతాళం డిసెంబర్ 2 (way2newstv.in)  
ఉరుకుంద లో వెలసిన పుణ్య క్షేత్రం శ్రీ నరసింహ స్వామి ఆదివారం  ఆలయ ప్రాంగణంలో 4 రాజ గోపురాలకు నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమాలు ఆలయ అధికారులు నిర్వహించారు.శంకుస్థాపన కార్యక్రమలకు ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే బాల నాగి రెడ్డి హాజరయ్యారు. 
నరసింహ స్వామి పుణ్య క్షేత్రం లో  4 రాజ గోపురాలకు భూమి పూజలు

శంకుస్థాపన లో పాలుపంచుకున్నారు.  ఆలయంలో గోపూజ, గణపతి పూజ, మండపరాదన, ఏకావరా రుద్రాభిషేకం, నవగ్రహ హోమాలు, స్వామి వారికి అభిషేకాలు, లక్ష్మీ హోమాలు, రుద్ర హోమాలు, పీఠ పూజలు వేద పండితులు స్వస్తి మహా మంగళ హారతులు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఆలయ అధికారులు ,అర్చకులు, వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment