Breaking News

16/12/2019

నియోజకవర్గానికి క్రిస్మస్ 1000 గిఫ్ట్ కిట్లు

కరీంనగర్, డిసెంబర్ 16, (way2newstv.in
క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమౌతోంది .క్రిస్టియన్‌ మైనార్టీలకు ప్రతి నియోజకవర్గంలో వెయ్యి కుటుంబాలకు కిట్లను అందిస్తున్నారు. ఈ సారి కూడా అదేవిధంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాలున్నాయి. వీటికి ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం నాలుగు వేల కిట్స్‌ను అందిస్తున్నారు. సంబంధిత నియోజకవర్గాలకు ఇప్పటికే వీటిని పంపిణీ చేస్తున్నారు. అలాగే, ప్రతి నియోజకవర్గకేంద్రంలో 19వ తేదీ లోగా క్రిస్మస్‌ దావత్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ దావత్‌ కోసం ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 2 లక్షల చొప్పున కేటాయించింది. 
నియోజకవర్గానికి క్రిస్మస్ 1000 గిఫ్ట్ కిట్లు

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు క్రిస్టియన్‌ మతపెద్దలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.క్రిస్టియన్‌ మైనార్టీలకు పంపిణీ చేసేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కిట్స్‌ సిద్ధం చేసినట్లు మైనార్టీ డెవలప్‌మెంట్‌ అధికారి రాజర్షిషా తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందిని సంబంధిత క్రిస్టియన్‌ మత పెద్దలు ఎంపిక చేస్తారు. పేదరికంలో ఉండి క్రిస్మస్‌కు కొత్త బట్టలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే ఈ కిట్స్‌ అందిస్తారు. అయితే, షెడ్యూల్‌ ప్రకారంగా ఇప్పటికే ఈ కిట్స్‌ను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెల 25న క్రిస్మస్‌ పండుగ ఉన్నందున ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారంగా కిట్స్‌ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.బతుకమ్మ పండుగకు అన్ని మతాల ఆడబిడ్డలకు చీరెలు పెడుతున్నది. అలాగే, రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు కొత్త బట్టలు అందజేస్తున్నది. క్రిస్మస్‌ సందర్భంగా కూడా క్రిస్టియన్‌ మైనార్టీల్లోని పేదలకు ఒక చీరె, జాకెట్‌, పైంట్‌, చొక్కాతోపాటు చుడీదార్‌తో కూడిన ఒక కిట్‌ను అందజేస్తున్నది. ఇలా సర్వ మతాలను సమానంగా గౌరవిస్తున్న ప్రభుత్వం, ఈ సారి కూడా క్రిస్మస్‌ సందర్భంగా క్రిస్టియన్‌ మైనార్టీలకు కిట్స్‌ అందించేందుకు సిద్ధమైంది. 2014 డిసెంబర్‌ నుంచే క్రిస్టియన్లకు ఈ కిట్స్‌ పంపిణీ చేస్తున్నది. నిరుపేద కుటుంబాలకు చెందినవారు ఏటా ఈ కిట్స్‌ అందుకుంటూ సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు.

No comments:

Post a Comment