Breaking News

16/12/2019

రాష్ట్రానికే ఆదాయ వనరుగా ఖమ్మం ఖిల్లా

ఖమ్మం, డిసెంబర్ 16,(way2newstv.in)
ఖమ్మం జిల్లాలో లభ్యమవుతున్న ఖనిజ సంపద తెలంగాణ ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న గ్రానైట్, బొగ్గు, డోలమైట్, ఇసుక సీనరేజ్‌ల ద్వారా భారీగానే ఆదాయం సమకూరుతున్నది. పెద్ద తరహా లీజులకు సింగరేణికి 1044.04 హెక్టార్లలో త్వకాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా చిన్న తరహా 218 గనులు తవ్వకాలు జరుగుతున్నాయి. వాటిలో 704.232 హెక్టార్లు ప్రభుత్వ భూమిలో, 172.627 హెక్టార్ల ప్రయివేటు భూములలో మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయి. మైనింగ్, ఇతర ఖనిజాల అక్రమ తవ్వకం, రవాణాలపై అపరాధ రుసుం ద్వారా 2019-20 ఆర్థిక సంతవ్సరంలో రూ. 80.68 కోట్లు ఆదాయం రాబట్టాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం లక్షాన్ని నిర్దేశించింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు రూ. 24.82 కోట్లు వసూళ్లయ్యాయి. అదేవిధంగా 2019-20 త్రైమాసికంలో సెప్టెంబర్ చివరి వరకు 17.92 కోట్లు సీనరేజ్ రూపంలో వసూలు అయ్యాయి. 
రాష్ట్రానికే ఆదాయ వనరుగా ఖమ్మం ఖిల్లా

అలాగే జిల్లాలో అందుబాటులో ఉన్న 9 ఇసుక క్వారీల ద్వారా 1.60 లక్షల ఆదాయం ఖజానాకు సమకూరింది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగు నెలలు మాత్రమే ఉండటంతో సర్కారు విధించిన టార్గెట్‌ను చేరుకునేందుకు జిల్లా భూగర్భ, గనులశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంతో పోల్చితే ఇప్పటి వరకు చేసిన వసూళ్లు మెరుగేనని, ఈ ఘనత కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని యంత్రాంగం వ్యాఖ్యానిస్తున్నది. ఇదిలా ఉండగా జిల్లాలోని సహజ వనరుల సద్వినియోగంపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ సాధన సమయంలో పలుమార్లు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి ఇక్కడి ఖనిజ సంపద గురించి ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన స్వరాష్ట్రంలో పాలనా భాద్యతలు చూస్తున్న ఆయన, గతంలో చెప్పిన మాదిరిగా జిల్లా ప్రజలకు ఉపయోగకరమైన పలు పరిక్షిశమలను స్థాపించేందుకు కసరత్తు చేస్తున్నారు.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నల్ల బంగారం నగానైట్, బైరటీస్, బొగ్గు, డోలమైట్, కోరండమ్, ఐరన్‌వోర్, క్వార్ట్, మైకా వంటి ప్రకృతి సహజసిద్ధ్దమైన వనరులు జిల్లా ప్రతిష్ఠను చాటుతున్నాయి. ఇక్కడి నుంచే ఖనిజ సంపద దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నది. ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలాల్లో సుమారు 500 గ్రానైట్ పరిక్షిశమలు ఉన్నాయి. వేలాది మంది కార్మికులు, నిరుద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం కూడా గ్రానైట్ పరిక్షిశమలను ప్రోత్సహిస్తూ రాయితీలతో అండగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో మూతపడే దశకు చేరుకున్న ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలను తిరిగి స్వరాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఎన్నో రాయితీలు ప్రకటించింది. 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నది. ఫలితంగా మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరుతున్నది. అంతేకాకుండా ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నది. జిల్లా పరిధిలోని ఖమ్మం డివిజన్‌లో నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ మండలాల్లో అపారమైన గ్రానైట్ నిల్వలున్నాయి. దశాబ్దాల తరబడి వ్యాపారులు గ్రానైట్ నిల్వలను వెలికితీస్తున్నా తరిగిపోని సంపద ఇంకా భూగర్భంలోనే దాగి ఉండటం విశేషం. దేశంలోని ముంబాయి, ఢిల్లీ, కలకత్తా వంటి పెద్ద పెద్ద మార్కెట్లకు సైతం జిల్లా నుంచే గ్రానైట్ సరఫరా చేయబడుతున్నది. ఖమ్మం నగరంతోపాటు ఖమ్మం అర్భన్, ఖమ్మం రూరల్ మండలాల పరిధిలో చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు 500 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు జిల్లాకు చెందిన గ్రానైట్ పరిక్షిశమపై శీతకన్నువేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అనేక పరిశ్రమలు మూతపడే దశకు చేరుకున్నాయి. స్వరాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పరిక్షిశమను ఆదుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వ్యాపారులకు రకరకాల రాయితీలు ప్రకటించారు. పరిక్షిశమలకు రోజూ 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నారు.ఇప్పటికే గత పదిహేనుళ్లుగా జేవీఆర్ కంపెనీ ఓసీలో బొగ్గు తవ్వకాలు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగానే సత్తుపల్లిలో మరో రెండు ఓపెన్ కాస్టుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నది. వాటికి సంబంధించి భూసేకరణ ప్రక్రియపై దృష్టి సారించింది. మరో మూడు లేదా నాలుగు సంవత్సరాల్లో పర్యావరణంతోపాటు మిగతా అన్నిరకాల అనుమతులు వస్తాయని, ఆ వెంటనే రెండు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు తవ్వకాలు జరుపనున్నారు. ఉమ్మడి జిల్లాలో సింగరేణి హెడ్డాఫీసు కొత్తగూడెంలో ఏర్పాటు చేయబడింది. దీంతో సత్తుపల్లి కూడా పాత కార్యాలయం పరిధిలోనే పరిగణిస్తూ వస్తున్నారు. కాగా సత్తుపల్లిలో రెండు ఓపెన్ కాస్టులు ప్రారంభమైతే జిల్లాకు ప్రత్యేక హోదాతోపాటు సింగరేణి ప్రధాన కార్యాలయం మంజూరు కానుంది. ఇదే జరిగితే దశాబ్దాల తరబడి బొగ్గును వెలికితీయనున్నారు. తద్వారా జిల్లాకు చెందిన వందలాది మంది సాంకేతిక విద్యార్థులకు, వేలాది మంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలతోపాటు ఉపాధి లభించనుంది.మరో వైపు బంగారం తయారీకి వినియోగించే అత్యంత ఖరీదైన క్వార్ట్ ఖనిజానికి సైతం ఖమ్మం జిల్లానే ప్రసిద్ధి కావటం విశేషం. జిల్లాలోని వేంసూరు, జమలాపురం, నరసింహపురం, భీమవరం, ఎర్రుపాలెం మండలంలోని అయ్యవారిగాడెంలలో నిల్వలున్నాయి. వీటన్నింటితోపాటు అన్నివర్గాల ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన ఇసుక కూడా జిల్లాలోని పలువూపాంతాల్లో లభ్యమవుతున్నది. మున్నేరు, కట్టలేరు, పాలేరు, ఆకేరుతోపాటు అశ్వరావుపేట సమీపంలోని గోదావరి నది నుంచి అవసరాలకు సరిపడా ఇసుక లభ్యమవుతున్నది.

No comments:

Post a Comment