నందికొట్కూరు నవంబర్ 19 (way2newstv.in)
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి అన్నదాతలకు అండగా ఉండి, వారు ఆర్థికంగా బలోపేతం చేసి,వారి మొహాలపై చిరునవ్వు చూడడమే ప్రభుత్వ ధ్యేయమని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో నందికొట్కూరు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా మొక్క జొన్నలు కొనగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షులు , నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ తొగురు.ఆర్థర్ గారు పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మన నందికొట్కూరు శాసనసభ్యులు మాట్లాడుతూ....
ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం
దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ఆర్ గారు రైతాంగ సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించెందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేశారని అన్నారు. రైతాంగం పండించిన అన్ని రకాల పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించి అన్నివిధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించి పరిష్కరించాలని పేర్కొన్నారు. త్వరలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా మన నందికొట్కూరు మార్కెట్ నందు ప్రారంభిస్తున్నట్లు అలాగే ప్రతి మండలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుట కు ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు తెలిపారు.రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు రూ.13,500 అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెట్ అధికారులు, రైతులు, నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment