Breaking News

19/11/2019

ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు కృషి చేద్దాం

ఐసీటీసీ కౌన్సిలర్ వి.రాంచందర్
నిర్మల్  నవంబర్ 19 (way2newstv.in)
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఖానాపూర్ ఐసీటీసీ కౌన్సిలర్ రామచందర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖానాపూర్ మండలం లోని  బావాపూర్ గ్రామంలో చైల్డ్ ఫండ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ, ఖానాపూర్ ఐసీటీసీ  ఆధ్వర్యంలో డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల ఆనుసారం "బి -స్మార్ట్ క్యాంపేన్ ఆన్నౌ యువర్ స్టాటస్ బి -స్మార్ట్ గెట్ స్టార్టెడ్ "  అనే నినాదంతో 15 రోజులపాటు హెచ్ఐవి స్క్రీనింగ్ మరియు అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు దానిలో భాగంగా మంగళవారం బావాపూర్ గ్రామంలో హెచ్ఐవి,టీబీ వ్యాధులపై అవగాహన మరియు పరీక్ష నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు కృషి చేద్దాం

ఈ సందర్భంగా ఐసీటీసీ కౌన్సిలర్ ,టీబీ సూపర్ వైజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ వ్యాధిపై అవగాహన ఉండాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందిలో ఏడుగురు బాధితులు ఉన్నారని అనుమానం ఉన్న ప్రతి వ్యక్తి ఈ నెల 30 తేది వరకు జరిగే ప్రత్యేక శిబిరాల్లో పరీక్షలు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గుర్తింపునకు నోచుకోని హెచ్ఐవి సోకిందంటే సమాజంలో చిన్నచూపు చూస్తారన్న భావనతోనే ముందుకు రావడం లేదని, సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రిలో టీబీ వ్యాధి నిమిత్తం వచ్చిన వారు, ఇతర వ్యాధులకు గురై వచ్చినప్పుడు డాక్టర్లు ఆనుమానించి పరీక్షించిన కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని తెలిపారు.హెచ్ఐవి నిర్థారణ అయినావ్యక్తులు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు.వారికి ఏఆర్ టీ ద్వారా మేరుగైన చికిత్సలు అందజేస్తునట్లు ,నేరుగా ఐసీటీసీ కేంద్రాలను సంప్రదించి, సలహా సూచనలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలోని 75 మందికి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. వ్యాధులు పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సూపర్ వైజర్   శశిమాల్ల , టీబీ సూపర్ వైజర్ వేణుగోపాల్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నిషన్ మహ్మద్ సాజీద్ అలీ, ఓఆర్ బ్యూ మంజుల,బోజన్న ,  ఏఎన్ ఎం  రజిత ,సుజాత, ,ఆశ వర్కర్లు, చంద్రకళ, గ్రామ సర్పంచ్ మల్లేశం, వార్డు మెంబర్లు,ఆర్ఎంపీ శంకర్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్,యువజన సంఘం సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment