Breaking News

22/11/2019

విశాఖలో జేడీ యాక్షన్ షురూ...

విశాఖపట్టణం, నవంబర్ 22,  (way2newstv.in)
జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికలకు ముందు జనసేనలో చేరి విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా జేడీ లక్ష్మీనారాయణ కుంగిపోలేదు. వెంటనే విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ విశాఖలో ఏర్పాటు చేసిన తన కార్యాలయానికి వచ్చి ప్రజలతో మమేకం అవుతున్నారు.ఇటీవల జరిగిన ఎన్నికలలో జేడీ లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీలో సైలెంట్ అయ్యారు. జనసేన ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవడం, జేడీ లక్ష్మీనారాయణ కు పార్టీలో ఎలాంటి పదవి పవన్ కల్యాణ‌్ ఇవ్వకపోవడంతో ఆయన మౌనంగా ఉన్నారు.
విశాఖలో జేడీ యాక్షన్ షురూ...

జేడీ లక్ష్మీనారాయణ ఒక దశలో పార్టీని వీడుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. పవన్ కల్యాణ్ నిర్ణయాల పట్ల జేడీ లక్ష్మీనారాయణ అసంతృప్తిగా ఉన్నారన్న వదంతులూ విన్పించాయి.జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఈ ప్రచారంపై జేడీ లక్ష్మీనారాయణ ఖండించక పోవడంతో అనేకమంది నిజమనే భావించారు. అయితే ఇటీవల జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ లో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొనడమే కాకుండా ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో ఉత్తరాంధ్ర బాధ్యతలను మాత్రమే చూస్తున్నారు.అయితే జేడీ లక్ష్మీనారాయణను దూరం చేసుకునే ఆలోచనలో పవన్ కల్యాణ్ లేరంటున్నారు. ఆయనకు త్వరలోనే పార్టీలో కీలక పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. జేడీ లక్ష్మీనారాయణ వాయిస్ ను పార్టీ ఉపయోగించుకోవడం మంచిదని పవన్ కల్యాణ్ కు అనేక మంది సన్నిహితులు సూచించినట్లు తెలిసింది. దీంతో జేడీ లక్ష్మీనారాయణకు త్వరలోనే జనసేన పార్టీలో కీలక పదవి దక్కడం ఖాయమంటున్నారు.

No comments:

Post a Comment