Breaking News

22/11/2019

వైసీపీ ఎంపీల్లో అసహనం...

న్యూఢిల్లీ, నవంబర్ 22 (way2newstv.in)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పార్లమెంటు సభ్యులను జగన్ దూరం పెడుతున్నారన్నది పార్టీలోనే జరుగుతున్న చర్చ. నిజానికి పార్లమెంటులోనూ, ఢిల్లీ స్థాయిలోనూ చక్రం తిప్పగలిగింది, నిధులు, ప్రాజెక్టులు తీసుకురాగలిగింది పార్లమెంటు సభ్యులు మాత్రమే. అయితే వారిని ఉత్సవ విగ్రహాలుగా జగన్ ప్రభుత్వం చూస్తుందన్నది వారి నుంచే విన్పిస్తున్న మాట. కొందరు వైసీపీ ఎంపీలు అసంతృప్తితో ఉండటానికి కారణం ప్రధానంగా ఎలాంటి పదవులు దక్కకపోవడమేనంటున్నారు.మొన్న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఉన్న 25 పార్లమెంటు స్థానాల్లో 22 చోట్ల వైసీపీ ఎంపీలు గెలిచారు. 
వైసీపీ ఎంపీల్లో  అసహనం...

వీరిలో సీనియర్లు ఒకరిద్దరు ఉన్నప్పటికీ మిగిలిన వాళ్లంతా దాదాపు కొత్త వాళ్లే. పార్లమెంటు గడప తొలిసారి తొక్కిన వాళ్లే. అయితే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి ఐదు నెలలు కావస్తోంది. అయితే ఇప్పటి వరకూ నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ వంటి పదవులను జగన్ భర్తీ చేశారు. అయితే వీటి భర్తీలో పార్లమెంటు సభ్యుల ప్రమేయమేదీ లేదన్నది వారి అసహనానికి కారణంగా తెలుస్తోందిమరోవైపు ఎమ్మెల్యేలు కూడా పార్లమెంటు సభ్యులను లెక్క చేయడం లేదు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులతో పాటు సంక్షేమ పథకాల అమలులో కూడా ఎంపీలను ఎమ్మెల్యేలు ఇన్ వాల్వ్ చేయడం లేదు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎంపీని మంత్రులు, ఎమ్మెల్యేలు సయితం లెక్క చేయడం లేదు. ఆయనకు తెలియకుండానే తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నిర్ణయాలు జరిగిపోతుండటం ఆవేదన కల్గిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు తప్పించి తమతో కలవకపోవడాన్ని కూడా వారు ఆక్షేపిస్తున్నారు.పార్లమెంటు సభ్యుల్లో అసహనాన్ని గమనించిన విజయసాయిరెడ్డి వారితో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ముఖ్యంగా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. ఇది పార్టీకి నష్టం కల్గించే అంశమే. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి పడటం లేదు. అలాగే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరిగింది. మంత్రులు కూడా ఎంపీలను లైట్ గా తీసుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే అసలుకే ముప్పు వస్తుందని గ్రహించిన విజయసాయిరెడ్డి జగన్ తో తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే ఎంపీల పెత్తనాన్ని ఎమ్మెల్యేలు సహిస్తారా? అన్నదే ప్రశ్న.

No comments:

Post a Comment