Breaking News

22/11/2019

ఏరులై పారుతున్న మద్యం

గన్నవరం నవంబర్ 22 (way2newstv.in)
కృష్ణాజిల్లా గన్నవరం లో అడ్డు అదుపు లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణం పక్కనే మహిళ మద్యం అమ్మడం స్థానికంగా విమర్శలకు తావునిస్తోంది. గత 4 రోజుల క్రితం నివాసాల  మధ్యలో ఉన్న  మద్యం దుకాణాన్ని మూసివేయాలని మహిళలు ఆందోళన చేశారు.  మందుబాబుల ఆగడాలు రోజు రోజుకూ హద్దుమీరుతుండటం,  నివాసాల మధ్యలో అక్కడే తాగడం, రోడ్డున వెళ్లే మహిళలు, ఆడపిల్లలకు భద్రత లేకుండా పోయిందని స్థానికుల ఆరోపణ. 
ఏరులై పారుతున్న మద్యం

తాగిన మైకంలో మహిళలను అసభ్య పదజాలం తో గట్టిగా అరవటం సామాన్యమయిపోయింది. మహిళలు ఏదయినా చిన్న అవసరానికి కూడా బయటకి రాలేకపోతున్నాం అని స్థానికులు మద్యం దుకాణాన్ని ఆరోజు మూసివేయించారు. అయితే,  మరసటి రోజు నుండి షరా మాములే అయింది. మద్యం దుకాణం, మహిళ నిర్వహిస్తున్న బెల్ట్ షాపు మళ్లీ తెరుచుకున్నాయి.  ప్రభుత్వం పూర్తి మద్యపాన నిషేధం దిశగా ముందడుగు వేయాలనే ఆలోచనతో వైన్ షాపులు, దాబాల్లో మద్యం అమ్మకాలు, బెల్టు షాపులు పూర్తిగా నిషేధించడం జరిగింది.  ఇవన్నీ నిషేధించి ఒక్క ప్రభుత్వ మద్యం దుకాణం మాత్రమే అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్ని నిబంధనలు అమలుచేసినా  చాటు మాటుగా 24 గంటలు మద్యం అమ్మకాలు మాత్రం కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment