Breaking News

22/11/2019

ఆరు నెలల పాలన…తొమ్మిది మోసాలు

యనమల మండిపాటు
అమరావతి నవంబర్ 22, (waya2newstv.in)
ఆరు  నెలల వైసిపి పాలనలో తొమ్మిది మోసాలు. అంతా ‘జగన్మాయే’ అంటూ శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఒక పత్రికా ప్రకటనలో ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్న ద్విసూత్ర పథకం(టూ పాయింట్ ఫార్ములా) ఇదే.  ఒకటి అన్ని రంగాల్లో అవినీతికి గేట్లెత్తేయడం, రెండవది టిడిపిపై, చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేయడం ద్వారా వైసిపికి,టిడిపికి తేడా లేదనే దుష్ప్రచారం చేయడమే అజెండాగా సీఎం జగన్ పెట్టుకున్నారని అయన వ్యాఖ్యానించారు.ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకే తీరని కళంకం సీఎం జగన్ తెచ్చారు. తన స్వార్ధం,అవివేకంతో రాష్ట్రానికి తీరని కీడు చేస్తున్నారు. పిపిఏల రద్దుపై గ్లోబల్ ఆర్బిట్రేషన్ తో ఏపికి అంతర్జాతీయంగా చెడ్డపేరు. 
ఆరు నెలల పాలన…తొమ్మిది మోసాలు

రూ.40వేల కోట్ల పెట్టుబడులను ప్రమాదంలోకి నెట్టారు. జపాన్, అబుదాబి, కెనడా ,అమెరికా ,సింగపూర్ 5 దేశాల్లో ఏపిపై విశ్వాసాన్ని దెబ్బతీశారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, ఐఎఫ్ సి(వరల్డ్ బ్యాంక్), బ్రూక్ ఫీల్డ్ , గోల్డ్ మ్యాన్ సాచ్స్ , అబుదాబి ఇన్వెస్ట్ మెంట్ అధారిటి, కెనడియన్ పెన్షన్ ఫండ్, ఆసియన్ డెవలప్ మెంట్ ఫండ్ తదితర సంస్థలన్నీ ఏపిని బ్లాక్ లిస్ట్ లోకి నెట్టే ప్రమాదం తెచ్చారని ఆరోపించారు.పిపిఏల రద్దుతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతింది. ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు రాకుండా చేశారు.  వైసిపి నిర్వాకాల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావు, ఉపాధి అవకాశాలు ఉండవు. యువతలో అశాంతి ప్రబలుతుంది. టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపిని ‘‘అంతర్జాతీయ పెట్టుబడులు గమ్యస్థానం’’ చేశాం.  వైసిపి పెడధోరణుల వల్ల అంతర్జాతీయంగా ఏపికి చెడ్డపేరు తెచ్చారు. పెట్టుబడులు పోగొట్టడమే అజెండాగా సీఎం జగన్ పెట్టుకున్నారు.‘‘జగనన్న విద్యా వసతి’’ మరో జగన్మాయ.. పాత స్కీమ్ కే కొత్తపేర్లు పెట్టి, యాడ్స్ ఇచ్చి ప్రజాధనం దండగ చేస్తున్నారు. ఇప్పటికే మెస్ ఛార్జిల కింద నెలకు రూ.1,400చొప్పున 10నెలలు ఇస్తున్నాం. ఆ మొత్తం రూ.14,000కు అదనంగా మరో రూ.5వేలు ఇతరత్రా కింద అందిస్తున్నాం. ఇప్పుడిచ్చే రూ.20వేలలో, ఆ రూ.19వేలు మినహాయిస్తే మిగిలేది రూ.1,000 మాత్రమే. 75% హాజరీ నిబంధన కింద లబ్దిదారుల సంఖ్యలో కోత పెడుతున్నారని విమర్శించారు. ఐటిఐ, పాలిటెక్నిక్ వృత్తి విద్య చదివేవారికి ఎగ్గొడుతున్నారు. ఈ కోతలతో ఆదా అయ్యే దాంట్లోనే ఆ రూ.1,000 ఇస్తున్నారు. అంతే తప్ప విద్యార్ధులకు కొత్తగా నయా పైసా కూడా ఇవ్వడంలేదు. తల్లిదండ్రులకు , విద్యార్ధులకు ఇంతకన్నా మోసం మరొకటుందా అని ప్రశ్నించారు. ‘‘పించన్ పెంపు మోసం’’ లాంటిదే ‘‘జగనన్న విద్యా వసతి మోసం’’ కూడా.. ఈ స్కీమ్ లకు ‘‘జగనన్న జిత్తులమారి మోసాలు’’ అనే పేరు బాగుంటుంది.పించన్ లో రూ.750 ఎగ్గొట్టి వృద్దులను దారుణంగా మోసగించారు. ఒక్కో రైతుకు రూ.5వేలు ఎగ్గొట్టి ‘‘భరోసా’’ను ఇంకో మోసం చేశారని అన్నారు. మోసాలకు అలవాటు పడ్డ ప్రాణం కదా, అందుకే పేదల పథకాల్లోనూ మోసమే చేస్తోంది. నవరత్నాలని పేరుపెట్టి నవ(9)మోసాలకు పాల్పడ్డారు. జగన్మాయకు కాలం చెల్లింది, పేదలే సంఘటితమై ఈ మోసాలను తిప్పికొడతారని యనమల పేర్కోన్నారు.

No comments:

Post a Comment