Breaking News

18/10/2019

అసలు కంటే వడ్డీలే ఎక్కువ...

విజయవాడ, అక్టోబరు 18, (way2newstv.in)
రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పుల కన్నా చెల్లిస్తున్న వడ్డీయే అధికంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు తీసుకున్న రుణం, చెల్లించాల్సిన వడ్డీని గమనిస్తే వడ్డీల భారం చాలా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోరది. ఇప్పటివరకు 13వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకోగా, వడ్డీకింద రు.16,144 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేస్తున్న అప్పులు తలకిమిరచిన భారంగా మారుతున్నాయి. ప్రస్తుతం చెల్లిస్తున్న అసలు వాయిదా, వడ్డీలు పదేళ్ల నాటివని అధికారులు చెబుతున్నారు. ఇందులో బహిరంగ మార్కెట్‌ రుణాలే ఎక్కువగా ఉన్నాయి. 
అసలు కంటే వడ్డీలే ఎక్కువ...

నెలకు రెండుసార్లు రిజర్వ్‌బ్యాంకు అధ్వర్యంలో నిర్వహించే వేలం ద్వారా తీసుకున్న రుణాలు ఈ ఏడాది రు.8,971 కోట్లుగా ఉండగా, గత రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ రు.13,417 కోట్లు కావడం విశేషం. ఇక నాబార్డ్‌ నుంచి రు.687 కోట్లు రుణంగా రాగా వారికి చెల్లించాల్సిన వడ్డీ రు.278 కోట్లు. ఉదరు బాండ్ల ద్వారా రు.1,154 కోట్లు రుణం ఉండగా, వడ్డీ భారం రు.902 కోట్లు, ఇతర రుణాల ద్వారా వచ్చింది రు.1,788 కోట్లుకాగా, చెల్లించాల్సిన వడ్డీ 1,397 కోట్లు, ఇఏపి ద్వారా రు.623 కోట్లు రాగా, వాటిపై రు.158 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి వస్తోరది. వడ్డీల భారం ఈ ఏడాది ఎక్కువగా ఉన్నప్పటికీ, 2022-23 ఆర్ధిక సంవత్సరం నురచి కొంతవరకు తగ్గుతూ ఉరటుందని ఆర్ధికశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే గత రుణాలపై వడ్డీ భారం కొంత తగ్గినప్పటికీ, మళ్లీ కొత్తగా చేసే రుణాలపై వడ్డీ జత కలుస్తుందని వారు చెబుతున్నారు. ప్రస్తుత లెక్కల మేరకు 2020-21 ఆర్ధిక సంవత్సరంలో చెల్లిరచాల్సిన అసలు 14 వేల కోట్లు, వడ్డీ 16 వేల కోట్ల వరకు ఉండగా, 2021-22లో అసలు 14,169, వడ్డీకింద 14,968 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ తరువాత సంవత్సరాల నురచి అసలు కన్నా వడ్డీ కొంతవరకు తగ్గుతూ వస్తుందని అరటున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న మొత్తం రుణం దాదాపు 2039-40 నాటికి పూర్తిగా చెల్లించడం జరుగుతురదని, వచ్చే ఏడాది నురచి తీసుకునే రుణాల భారం 2040 సంవ త్సరం నురచి మళ్లీ పెరుగుతుందని వారు విశ్లేషిస్తున్నారు.

No comments:

Post a Comment