Breaking News

18/10/2019

ఏపీలో పక్కా వ్యూహాలతో కమల ధళం

విజయవాడ, అక్టోబరు 18, (way2newstv.in)
బలం లేదని తెలుసు. కానీ బలపడితీరాలన్న కసి మాత్రం ఆ పార్టీకి మెండుగా వుంది. దానికోసం పక్కా వ్యూహాలతో సిద్ధం అవుతుంది కమలదళం. ఎపి లో ఆ పార్టీ ఉనికి నామమాత్రమే. కాంగ్రెస్ తో సమానంగా బలపడే అవకాశాలు వచ్చినప్పుడల్లా టిడిపి ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోయింది కమలం. ప్రతీసారి ఆ పార్టీ కి అదే సీన్ రావడంతో క్యాడర్ సైతం అధిష్టానం వైఖరిపై అంతర్మధనం తో అల్లాడిపోతూ ఉండటం రివాజుగా మారింది. కానీ ఈసారి సీన్ మారింది.తమకు చుక్కలు చూపించిన పసుపు పార్టీ దీనావస్థలో వుంది. కేంద్రంలో బలంగా తమ పార్టీ రాజ్యమేలుతుంది. ఏపీలో అధికారంలో వున్న వైసిపి కేంద్రంపై యుద్ధం చేసే శక్తి లేనేలేదు సరికదా బిజెపి సహకారంపైన రాష్ట్రాభివృద్ధి చేసుకోవాలిసిన పరిస్థితి. 
ఏపీలో పక్కా వ్యూహాలతో కమల ధళం

ఇంతకన్నా తాము బలపడేందుకు అవకాశం ఏముంటుంది అందుకే మోడీ – అమిత్ షా ద్వయం వ్యూహంతో ముందుగా వచ్చినవారిని వచ్చినట్లు పార్టీలో చేర్చుకుంటూ తాము బలపడినట్లు గట్టి సంకేతాలు జనంలోకి పంపుతుంది కాషాయ పార్టీ.ఏ పార్టీ అయితే తమ పార్టీ ముందుకు వెళ్లకుండా అడ్డుపడిందో అదే పార్టీ నుంచి వచ్చిన వారితో దెబ్బకొట్టాలని ఆలోచన చేస్తుంది బిజెపి. సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటివారు ఇటీవల తరచూ ఇక ఎపి లో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లింది అనే ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఆ రకంగా అటు అధికారపార్టీ వైసిపి, ఇటు ప్రతిపక్ష టిడిపి లు వచ్చే ఎన్నికల్లో చేసేదేమి లేదనే సందేశాన్ని బలంగా జనంలోకి వీరు తీసుకువెళుతున్నారు. అయితే ఈ సందేశం మరీ ముఖ్యంగా టిడిపి కె ఎక్కువ దెబ్బకొట్టేలా వుంది. ఇప్పటికే ఆ పార్టీనుంచి వలసలు చాలా ఎక్కువగానే సాగుతున్నాయి.బిజెపి సైతం తమకు వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి వైసిపి తప్ప టిడిపి కాదని అంటుంది. వచ్చే ఎన్నికల లోగా టిడిపి లో వున్న ప్రధాన వ్యక్తులను శక్తులను ఖాళీ చేయించడం లక్ష్యంగా కమలదళం గట్టి కసరత్తులు చేస్తూ వస్తుంది. మిషన్ 2024 అనే టార్గెట్ తో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలను నయానో భయానో లొంగతీసుకునే పని శరవేగంగా నడుస్తుంది. మేఘా కృష్ణా రెడ్డి వంటివారిపైనే ఐటి, ఈడీ దాడులతో బిజెపి తీర్ధం పుచ్చుకోకపోతే జరిగే అనర్ధాలు ఎలా వుంటాయో చెప్పక చెప్పేస్తుంది. దాంతో రానున్న రోజుల్లో బడాబాబులంతా ప్రాంతీయ పార్టీలను వదిలి జై శ్రీరామ్ అనక తప్పేలా లేదంటున్నారు విశ్లేషకులు.

No comments:

Post a Comment