Breaking News

15/10/2019

మధ్యవర్తిగా ఉండేందుకు ఓకే :కేకే

హైద్రాబాద్, అక్టోబరు 15, (way2newstv.in)
సీ కార్మికుల సమ్మెపై టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు మరోసారి స్పందించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మధ్యవర్తిగా ఉంటాను అని కేకే స్పష్టం చేశారు. సమ్మె విషయంలో సీఎం నన్ను ఇప్పటి వరకు పిలవలేదు.. ఆర్టీసీ కార్మికులూ కలవలేదు అని తెలిపారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చనిపోయారన్న బాధతో నిన్న ప్రకటన జారీ చేశాను. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పునరాలోచన చేయాలని కోరాను అని కేకే పేర్కొన్నారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం కే కేశవరావు ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు వెంటనే తమ సమ్మెను విరమించాలని కోరారు. 
మధ్యవర్తిగా ఉండేందుకు ఓకే :కేకే

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా ఇతర సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాలని లేఖలో సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నదని తెలిపారు. దీనిలో భాగంగానే కార్మికులకు 44% ఫిట్‌మెంట్, 16% ఐఆర్ ఇచ్చిందన్నారు. ఆర్టీసీ విలీనం మినహా మిగిలిన సమస్యలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయబోమని చెప్పిన సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేకే తెలిపారు.అద్దె బస్సులు, ప్రైవేటు స్టేజ్ క్యారేజ్‌ల విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటనను సమ్మె నేపథ్యంలో తీ సుకున్న నిర్ణయంగా భావించాలని ఆర్టీసీ నాయకులకు సూచించారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీకి తానే నేతృత్వం వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్ తన మ్యానిఫెస్టోలో ఎక్క డా పెట్టలేదని స్పష్టంచేశారు. ఆర్టీసీనే కాదు ఏ ప్రభుత్వరంగ సంస్థనూ ప్రభుత్వంలో విలీనం చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొనలేదని చెప్పా రు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనంచేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమేనని ఆయన పేర్కొన్నారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధంలేని అంశమని పేర్కొన్నారు.

No comments:

Post a Comment