Breaking News

15/10/2019

ప్రతి ఇంటి వద్ద కంపోస్ట్ పీట్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి

 జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన
పెద్దపల్లి    అక్టోబర్ 15 (way2newstv.in)
జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటి వద్ద కాంపోస్ట్ పిట్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. కాంపోస్ట్ పెట్టి నిర్మాణం, స్వచ్ఛత గృహం అంశాలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి లోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని జీరో చెత్త డిశ్చార్జి గృహంగా రూపుదిద్దే విధంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా కంపోస్ట్ పిట్ ఏర్పాటు చేయాలని దీనికి అవసరమైన నిధులు, అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. 
ప్రతి ఇంటి వద్ద కంపోస్ట్ పీట్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి

కాంపోస్ట పిట్ లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఇంట్లో తడి చెత్త ,పొడి చెత్త వేరు వేరుగా సేకరించి , కంపోస్ట్ ద్వారా తడి చెత్తను ఎరువుగా మార్చే అవకాశం ఉందని, సదరు ఎరువులను గ్రామంలోని రైతులకు విక్రయించే అవకాశం ఉందని వీటి పట్ల ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాల పట్ల పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించి వారు ఆసక్తి కనబరిచే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని,విద్యార్థులు భాగస్వామి అయితే కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ వారి లో పోషక విలువలను పెంచాలని, ఇందుకోసం ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని, దీనికి సంబంధించిన సీడ్స్  అందించేందుకు  శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారని, పూర్తిస్థాయిలో లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే నర్సరీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉత్సాహంగా పని చేసే స్వశక్తి మహిళా బృందాలను గుర్తించాలని, వారికి అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మన గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని, దీనిని ప్రభుత్వం నిషేధించింది అని , ప్లాస్టిక్ స్థానంలో లో క్లాత్ బ్యాగ్ లను వినియోగించాలని, వీటిపై విస్తృతంగా ప్రజలలో ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో లో మా గృహం -స్వచ్ఛత గృహం  అనే కార్యక్రమం రూపొందించామని, విజయవంతంగా ఈ కార్యక్రమం మన జిల్లాలో అమలు చేయాలని, ప్రజల విస్తృత భాగస్వామ్యంతో అది సాధ్యమవుతుందని కలెక్టర్ అధికారులకు సూచించారు. మా గృహం-  స్వచ్ఛత గృహం కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతంలో ప్లాస్టిక్ ను నిషేధిస్తూ స్టీల్ పాత్రలను, బట్ట సంచులను వినియోగించాలని, తడి చెత్తను కంపోస్ట్ గుంత ద్వారా ఎరువుగా మార్చుకోవాలని, ఇంట్లోనే తడి చెత్త ,పొడి చెత్త వేరు చేయాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను, కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలని, కుటుంబ సభ్యులందరూ మరుగుదొడ్డిని వినియోగించాలని, మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం శానిటరీ నాప్కిన్ లను వినియోగించాలని, గ్రామంలో పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఇంట్లో కనీసం ఐదు మొక్కలు నాటి వాటిని పూర్తిస్థాయిలో సంరక్షించాలి అని, వీటి సాధన దిశగా అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

No comments:

Post a Comment