Breaking News

15/10/2019

వైసీపీ నేతలు ఆంబోతుల్లా మీద పడుతున్నారు : చంద్రబాబు

నెల్లూరు, అక్టోబరు 15, (way2newstv.in)  
వైఎస్సార్‌సీపీ నేతలు ఆంబోతుల్లా టీడీపీ కేడర్‌పై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని.. చివరికి జర్నలిస్టులు, అధికారులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఇది నేరస్థుల ప్రభుత్వమని.. అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరులో జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో మాట్లాడిన బాబు.. జగన్ సర్కార్‌పై మండిపడ్డారు.టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని.. పైగా చోద్యం చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
వైసీపీ నేతలు ఆంబోతుల్లా మీద పడుతున్నారు : చంద్రబాబు

పార్టీ మారాలని బెదిరిస్తున్నారని.. మారకపోతే దాడులు చేస్తుతున్నారని విమర్శించారు. వెనుకబడిన, బలహీన వర్గాలను వేధించడమే వైఎస్సార్‌సీపీ పనిగా పెట్టుకుందన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని.. తానూ సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ నేతల్లా వ్యవహరించి ఉంటే వారు ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు.బెట్టింగ్‌లు, దొంగసారా కాసేవాళ్లు ఎమ్మెల్యేలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. కేసుల పేరుతో వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు.. మహిళల జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు పిచ్చి పట్టిందని.. జగన్ జేఎస్టీలా లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ టాక్స్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు ఆపకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు.వైఎస్సార్‌సీపీ నేతల దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకుంటామని.. అండగా ఉంటామన్నారు చంద్రబాబు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని.. పోలీసులపై కోర్టుకు వెళ్తామన్నారు. బాధితుల తరఫున పోరాటం చేస్తామని.. వారు ధైర్యంగా ఉండాలని చెప్పారు టీడీపీ అధినేత.

No comments:

Post a Comment