Breaking News

29/10/2019

స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజలు
జోగులాంబ గద్వాల అక్టోబరు 29 (way2newstv.in)
మంగళవారం నాడు  గద్వాల నియోజకవర్గంలో  కె.టి దొడ్డి మండలంలోని  వెంకటాపురం గ్రామం లోని శ్రీ శ్రీ శ్రీ పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రాంరంభమయ్యాయి. ఈ  సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్వామివారికి సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను సమర్పించారు.  దేవాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ( పాగుంట జాతర) ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించాలి. 
స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.  జాతర సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను  స్టాల్స్ ఏర్పాటు చేసి , ప్రజలకు పథకాలపై అవగాహన  చేయడం జరుగుతుంది. జాతర సందర్భంగా రైతు సంబరాలను కూడా ఎద్దుల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.  అనంతరం బ్రహ్మోత్సవాలు(జాతర) పనులను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఆయన వెంట జెడ్ పి టి సి లు రాజశేఖర్, పద్మా వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచ్  అంజనేయులు, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు హనుమంత,  ధరూర్ మాజీ  ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, తెరాస పార్టీ నాయకులు ధరూర్ నరసింహా రెడ్డి,చక్రధర్ ,జంబు రామన్ గౌడ్, జాకీర్ , గంగంపల్లి ప్రతాప్ రెడ్డి,  శేఖర్ రెడ్డి, రాజేష్ , శేఖర్, సతీష్  మరియు ఈవో పురంధర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment