Breaking News

29/10/2019

వీఆర్ కాలేజీని పరిశీలించిన మంత్రి అనిల్

నెల్లూరు అక్టోబరు 29 (way2newstv.in)
మంగళవారం నాడు నెల్లూరు పట్టణంలోని వి.ఆర్. కళాశాలని  జలవనరులశాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సందర్శించారు. అక్కడి  మౌళిక వసతులపై ఆరాతీశారు. మంత్రి మాట్లాడుతూ నగర నడిబొడ్డులో ఇంతటి కళాశాల నెల్లూరు నగరంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. వి.ఆర్. కళాశాలని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.
వీఆర్ కాలేజీని పరిశీలించిన మంత్రి అనిల్

కళాశాల చరిత్రలో ఒక మంత్రి వి.ఆర్. కళాశాలకు వచ్చి ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చేస్తాను అన్న ఒకేఒక మంత్రి  అనిల్ కుమార్ యాదవ్ అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనియాడారు.వి.ఆర్. కళాశాల అభివృద్ధి బాధ్యతలు నూతన కమిటి ఏర్పడేదాకా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మంత్రి అప్పగించారు.   ఇందులో అన్ని రాజకీపార్టీలను, ప్రజా సంఘాలను, మేధావుల సమన్యయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ను మంత్రి కోరారు.

No comments:

Post a Comment