హైదరాబాద్ అక్టోబర్ 29 (way2newstv.in)
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. మంత్రి పువ్వాడ, అడ్వకేట్ జనరల్, ఆర్టీసీ అధికారులతో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం ముగిసింది. ఈ భేటీలో హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై.. అడ్వకేట్ జనరల్, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
అడ్వకేట్ జనరల్, ఆర్టీసీ అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం
ఈ సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం నాటికి 25వ రోజుకు చేరింది.
No comments:
Post a Comment