Breaking News

17/09/2019

రక్తదానం మహాదానం....

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం....
వనపర్తి సెప్టెంబర్ 17  (way2newstv.in)
అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మహాదానం అని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటయ్య, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఖాజా ఖుతుబుద్దీన్, వైస్ చైర్మన్ మహమ్మద్ అమర్ లు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ముద్ర సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి వారు ప్రసంగించారు. 
రక్తదానం మహాదానం....

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించేందుకు రక్తం ఎంత ప్రధానమైనదని, అందుకోసం ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని వారు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం లో ఉన్న ఆనందం మరి దేంట్లో లేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేందర్, ట్రైనింగ్ ఎస్సై ఉమా, రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment