నిర్మల్ సెప్టెంబర్ 17 (way2newstv.in)
జిల్లా ఎస్పీ .సి.శశిధర్ రాజు గారి అధ్వరములో ట్రాఫిక్ సిబ్బందికి మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిభంధనలు ప్రజలకే కాకుండా ముందుగా పోలీస్ శాఖ వారు పాటించాలని, పోలీస్ శాఖలోని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన పెంచుకొని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్టు వాడలన్నారు.
ట్రాఫిక్ సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం
జిల్లాలోని అన్ని పాటశాల బస్సులు నడిపే డ్రైవర్స్, ఐచర్ డ్రైవర్ లు, లారి డ్రైవర్ లు, ఆటో రిక్షా నడిపే వారిని ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కార్యక్రమాలు జరుపాలని, ఇంటర్ మీడియాట్, డిగ్రీ చదివే విద్యార్థులు బైక్ రైడింగ్ లు చేయకుండా నిరోధించాలని, వేఘంగా పోవడము, సమయం కాకుండానే సిగ్నల్స్ దాటడం, తాగి ద్విచక్ర వాహనాలు నడుపకుండా అవగాహన కార్యక్రమాలు నిరంతరముగా ట్రాఫిక్ వారి అధ్వర్యంలో జరుపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ. సంతోష్ సింగ్, ఐ.టి. కోర్ టీం ఇంచార్జ్ యస్.కె. మురాద్ అలి, ట్రాఫిక్ ఏఎస్సైలు, మరియు ట్రాఫిక్ సిబ్బంది హాజరయ్యారు.
No comments:
Post a Comment